నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 27 : నాగర్‌కర్నూల్ జిల్లా పోలీస్ కార్యాలయం పరేడ్‌గ్రౌండ్‌లో శుక్రవారం డ్యూటీమీట్ నిర్వహించారు. డాగ్స్ స్కాడ్స్ విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. డీజీపీ ఆదేశాల మేరకు డ్యూటీమీట్-2024 నిర్వహించినట్లు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఒక ఫేక్ క్రైమ్ సీన్‌ను క్రియేట్ చేసి.. దానిపై ఎలాంటి అవగాహన ఉంది అనే అం శంపై సబ్ ఇన్స్పెక్టర్ నుంచి డీఎస్పీ వరకు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మీద పరీక్ష రాయించి, ఇంటర్వ్యూలు నిర్వహించారు. కంప్యూటర్ టెస్ట్, క్లూస్‌టీమ్, వివిధ టెస్టులను కానిస్టేబుల్ నుంచి ఏఎస్సై వరకు ఏర్పాటుచేశారు. పరేడ్ గ్రౌండ్లో ఏఆర్ ఏఎస్పీ భరత్ సమక్షంలో డాగ్ స్కాడ్‌తో నిర్వహించిన డ్యూటీమీట్ ఆకట్టుకున్నది. ప్రతిభ కనబరిచిన వారు జిల్లా నుంచి జోనల్ లెవల్‌కు.. అక్కడి నుంచి స్టేట్ లెవల్‌కు.. అటు నుంచి నేషనల్ లెవల్‌కు వెళ్లి గోల్డ్‌మెడల్‌తో వస్తే ఇంక్రిమెంట్‌తోపాటు ప్రైజ్ మనీ కూడా ఇవ్వనున్నట్లు ఎస్పీ తెలిపారు.