వెల్దండ, ఫిబ్రవరి 26 : శివరాత్రి ఉత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకున్నది. గుండాలలోని కోనేరులో ఇం టర్ విద్యార్థి గల్లంతైన సంఘటన చోటు చేసుకున్నది. వివరాలిలా.. కల్వకుర్తి మున్సిపాలిటీ జేపీనగర్‌లోని గురుకుల పాఠశాలలో ఇంటర్ చదువుతున్న ఓమేశ్ (17) శివరాత్రిని పురస్కరించుకొని తోటి విద్యార్థులతో కలిసి బుధవారంం ఉదయం 10 గంటలకు గుండాల పుణ్యక్షేత్రానికి వెళ్లారు. అక్కడ కోనేరులో స్నానం ఆచరిస్తుండగా ప్రమాదవాశాత్తు నీట మునిగి గల్లంతయ్యాడు. తోటి విద్యార్థులు విషయాన్ని ఆలయ కమిటీకి తెలిపారు. వారు సమాచా రం ఇవ్వగా.. పోలీసులు, దేవాదాయశాఖ, అగ్నిమాపక అధికారులు కోనేరు వద్ద గాలింపు చర్యలు చేపట్టారు. సీఐ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎస్సై కురుమూర్తి, జియాగూడ కమేళ యాదవ సంఘం అధ్యక్షుడు జంగయ్యయాదవ్, ఉత్సవ కమిటీ చైర్మన్ అరుణ్‌నాయక్, కోటి యాదవ్ 8 గంటలపాటు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు కోనేరు లో నీటిని ఐదు మోటర్ల ద్వారా బయటకు తోడేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, టాస్క్ సీవోవో రాఘవేందర్రెడ్డితోపాటు పలువురు నాయకులు ఘటనా స్థలానికి చేరుకొని పర్యవేక్షించారు.
రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి
మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్
గుండాల కోనేరులో గల్లంతైన విద్యార్థి మృతికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. కోనేరు వద్ద గాలింపు చర్యలను ఆయన పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ పండుగపూట ఇంటర్ విద్యార్థి మృతి చెంద డం బాధాకరమన్నారు. ప్రభుత్వం, జిల్లా యంత్రంగం స్పందించి మృతదేహాన్ని వెలికితీసి అతడి తల్లిదండ్రులకు అప్పగించాలన్నారు. విద్యార్థి కుటుంబానికి రూ.25 లక్ష లు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే రూ.10 కోట్లు మంజూరు చేసి గుండాల కోనేరును పునరుద్ధరించాలని కోరారు. సమావేశంలో ఆలయ కమిటీ చైర్మన్ సందీప్‌రెడ్డి, బీఆర్ఎస్ నా యకులు మధుసూదన్‌రెడ్డి, భాస్కర్‌రావు, జోగయ్య, ని రంజన్, తారాసింగ్, శ్రీనునాయక్, కొండల్ తదితరులు పాల్గొన్నారు.
చెరువులో పడి మరొకరు..
లింగాల, ఫిబ్రవరి 26 : నల్లమల అటవీ ప్రాంతంలోని భౌరాపూర్ ఉత్సవాల్లో బుధవారం అపశృతి చోటు చేసుకున్నది. ఎస్సై నాగరాజు కథనం ప్రకారం బల్మూర్ మండలంలోని బిల్లకల్ గ్రామానికి వల్వాయి కృష్ణయ్య (40) మంగళవారం తన కుతూరుతో కలిసి బైక్‌పై భౌరాపూర్ ఉత్సవాలకు వెళ్లాడు. బుధవారం కుతూరుకు స్నానం చే యించి తర్వాత తాను కూడా స్నానం చేయడానికి చెరువుల్లో దూకాడు. ఈ క్రమంలో అతను లోపలే ఇరుక్కుపోయినట్లు తెలిపారు. కాగా మరో వ్యక్తి చెరువులో స్నానం చేస్తుండగా మృతుడి కాళ్లు తగలడంతో గమనించి బయటకు తీయగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృ తుడికి భార్య రేవతమ్మ, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నా రు. భార్య ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.