ఆన్‌జాబ్ ట్రైనింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలి
ఆన్‌జాబ్ ట్రైనింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇంటర్ విద్య నోడల్ అధికారి వెంకటరమణ సూచించారు. ఇంటర్ ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు నిర్ధేశించిన ఆదేశాల మేరకు సంబంధిత కంపెనీ/ ఫార్మ్/డిపార్ట్‌మెంట్‌ల్లో ఆన్‌జాబ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించాలని ఆదేశించారు.
- జిల్లా ఇంటర్ విద్య నోడల్అధికారి వెంకటరమణ
నాగర్‌కర్నూల్, డిసెంబర్ 9: ఆన్‌జాబ్ ట్రైనింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇంటర్ విద్య నోడల్ అధికారి వెంకటరమణ సూచించారు. ఇంటర్ ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు నిర్ధేశించిన ఆదేశాల మేరకు సంబంధిత కంపెనీ/ ఫార్మ్/డిపార్ట్‌మెంట్‌ల్లో ఆన్‌జాబ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించాలని ఆదేశించారు.ఈ నేపథ్యంలో శుక్రవారం డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటో మొబైల్ విద్యార్థులకు నాగర్‌కర్నూల్ హౌజింగ్‌బోర్డులోని వెంకటేశ్వర ఆటో మొబైల్ సర్వీసింగ్ విభాగంలో ఆన్‌జాబ్ ట్రైనింగ్ శిక్షణ ఇచ్చారు.
ట్రైనింగ్ నిర్వహణను జిల్లా ఇంటర్ విద్య నోడల్ అధికారి తనిఖీ చేసి పలు సూచనలు, సలహాలను ఇచ్చారు. జిల్లాలోని ఒకేషనల్ విద్యను కలిగి ఉన్న ప్రతి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, సంబంధిత అధ్యాపకులు ఆన్‌జాబ్ ట్రైనింగ్(ఓజేటీ) నిర్వహణ కచ్చితంగా చేయాలన్నారు. అధ్యాపకులు బోర్డు నిర్దేశించిన ఆదేశాల మేరకు చక్కని శిక్షణ ఇప్పించి విద్యార్థులను ప్ర యోజకులుగా చేయాలని అధ్యాపకులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆటోమొబైల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ అధ్యాపకులు భగవేని నర్సింహులు, రవిప్రకాశ్, విద్యార్థులు పాల్గొన్నారు.
పాలెం కళాశాలను సందర్శించిన డీఐవో
జిల్లాలోని బిజినేపల్లి మండలం పాలెం శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ జూనియర్ కళాశాలను శుక్రవారం జిల్లా ఇంటర్ విద్య నోడల్ అధికారి వెంకటరమణ పరిశీలించారు. ఈసందర్భంగా సిలబస్ కవరేజ్, ప్రాక్టికల్స్ నిర్వహణలపై అధ్యాపకులకు సూచనలు, చేశారు. ఆయన వెంట కళాశాల ప్రిన్సిపాల్ ఆనంద్‌గౌడ్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

