జడ్చర్ల టౌన్, డిసెంబర్ 23 : విద్యార్థుల్లో విద్యా సామర్థ్యాలను పెంపొందించాలని జిల్లా విద్యాధికారి రవీందర్ చె ప్పారు. బాదేపల్లి బాలుర జెడ్పీ హైస్కూల్లో శుక్రవారం పాఠశాల కాంప్లెక్స్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన రవీందర్ ఉపాధ్యాయులనుద్దేశించి మాట్లాడారు. ప్రతి పాఠశాలలో టీఎల్ఎం వినియోగిస్తూ ప్రణాళిక ల ప్రకారం విద్యాబోధన చేపట్టాలన్నారు. టీఎల్ఎం అనేది విద్యార్థి స్వతహాగా నేర్చుకునే విధంగా ఉండాలన్నారు. వి ద్యార్థుల విద్యా సామర్థ్యాలను గుర్తించే విధానాన్ని వివరించారు. అనంతరం పట్టణంలోని ఎర్రసత్యం ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించారు. తరగతిగదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులతో బోర్డుపై లెక్కలను రాయిం చి సామర్థ్యాలను తెలుసుకున్నారు. పలువురు విద్యార్థుల ప్రతిభను అభినందించారు. కార్యక్రమంలో ఎంఈవో మం జులాదేవి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలల అభివృద్ధి కోసం ప్రతిఒక్కరూ సహకరించాలని సర్పంచ్ కృష్ణారెడ్డి అన్నారు. మండలంలోని లక్ష్మీపల్లి ప్రభుత్వ పాఠశాలలో లాల్కోట ఐశ్వర్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొ ని ఉన్నతస్థాయికి ఎదుగాలని సూచించారు. పూర్వవిద్యార్థు లు, యువకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పాఠశాల బ లోపేతానికి కృషి చేయడంతోపాటు స్వచ్ఛందంగా సంస్థలు తోడ్పటు అందించి పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలన్నా రు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లు, ఐశ్వర్య ఫౌండేషన్ అధినేత కిశోర్, డైరెక్టర్ అనుదీప్, ఉపాధ్యాయులు, మార్కె ట్ కమిటీ డైరెక్టర్ మ న్యంకొండ తదితరు లు పాల్గొన్నారు.
వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందన విద్యార్థులు లక్ష్యసాధన కోసం కృ షి చేసి మంచి ర్యాంకులు సాధించాలని ప్రొఫెసర్ చలపతి అన్నారు. మండలంలోని ప్రభుత్వ జూనియార్ కళాశాల వి ద్యార్థులకు శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సుకు హాజరై మాట్లాడారు. విద్యార్థులు చదువుతోపాటు జనరల్ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పరీక్షలంటే బయపడొద్దని, దైర్యంగా పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ భీంసేనా, డీఆర్ త్రివిక్రమ్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.