వనపర్తి, జూలై 12 : తండాల్లో నాగరికత పెరిగి.. ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని అభివృద్ధి చెందారని, కష్టపడే తత్వమే వారిని ఈ స్థాయికి తీసుకొచ్చిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపా రు. వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, కలెక్టర్ తేజస్ నందలాల్పవర్తో కలిసి బుధవారం మంత్రి నిరంజన్‌రెడ్డి గిరిజనులకు పోడు పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం మంత్రి మండలి నిర్ణయం మేరకు పోడు భూముల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టామన్నారు. గిరిజనులు అనేక దశాబ్దాలుగా సాగు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారని.. భూమి దక్కుతుందో లేదో అని ని త్యం బెంగ పెట్టుకునేవారన్నారు. అలాంటి గిరిజన రైతులకు పోడు పట్టాలు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్నారు. భవిష్యత్తు లో ఈ నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించకుండా హరితహా రం ద్వారా మొక్కలు నాటి ఏడు శాతం అటవీ ప్రాం తాన్ని పెంచడం జరిగిందన్నారు. ఇకముందు గిరిజను లు చెట్లు నరకకుండా ఉంటామని వారితో హామీ పత్రం తీసుకున్నామన్నారు. రాష్ట్రంలోని 2,845 గ్రామ పంచాయతీ తండా ల్లో 1.50 లక్షల మందికి 4.35 లక్షల ఎకరాలకు సం బంధించి పోడు పట్టాలు అందజేశామన్నారు.
ఎక్కడైనా సర్వే చేయకపోవడం, సరైన పత్రాలు చూపించడంలో జాప్యం జరిగి అర్హత ఉంటే వారికి మరోమారు సర్వే చే యించి పోడు పట్టాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. పోడు పట్టా లబ్ధిదారులు ఎకరాకు 15 మొ క్కలు పెంచాలని సూచించారు. అనంతరం జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి మాట్లాడుతూ పోడు పట్టాలు పొందిన లబ్ధిదారులు వాణిజ్య పంటలు సాగుచేస్తే బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలు అందుతాయన్నారు. పోడు పట్టాలు పొందిన వారికంటే ప్రభుత్వానికే ఎక్కువ సం తోషంగా ఉందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా స్థా యి కమిటీ ద్వారా 415 మంది రైతులకు 481 ఎకరాలకు సంబంధించి పోడు పట్టాలు అందజేశామన్నారు. జిల్లా అభివృద్దిలో ప్రజాప్రతినిధులు, అధికారులు సహకారం అందించాలన్నారు. కార్యక్రమంలో డీఎఫ్‌వో నవీన్‌రెడ్డి, డీటీడీవో శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్‌గౌడ్, ఖిల్లాఘణపురం ఎంపీపీ కృష్ణా నాయక్, జెడ్పీటీసీ సామ్యనాయ క్, ఎంపీటీసీ ధర్మానాయక్ తదితరులు పాల్గొన్నారు.