నాగర్‌కర్నూల్, జూలై 15 (నమస్తే తెలంగాణ) : సీజనల్ రోగాలొస్తే వైద్యశాఖ హడావుడి చేస్తూందే తప్పా.. ముందస్తు చర్యలకు సిద్ధమవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. నల్లమల ప్రాంతమైన నాగర్‌కర్నూల్ జిల్లాలో వైద్యశాఖ తీరుపై గతంలోనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ముందస్తుగా రోగులకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచడంలో తీసుకుంటున్న చర్య లు ప్రశ్నార్థకంగా మిగులుతున్నాయి. మందుల కొరతను తీర్చేందుకు ముంద స్తు చర్యలు కనిపించడం లేదు. వానకాలం, ఎండాకాలంలో ప్రధానంగా సీజనల్ రోగాలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. ఎండాకాలంలో వడదెబ్బ ప్రభావం చూపిస్తే వానకాలంలో డెంగీ, మలేరియా, డయేరియా, టైఫాయిడ్, పాము కాట్లు, కుక్కకాట్లులాంటి రోగాలు ఇబ్బందులు కలిగిస్తుంటా యి. ముఖ్యంగా నల్లమల ప్రాంతమైన నాగర్‌కర్నూల్‌లోని కొల్లాపూర్, అచ్చంపేటలోని చెంచు పెంటలు, అటవీ పరిసర గ్రామాల్లో దోమ సంక్రమిత వ్యాధుల ప్రభావం ఎక్కు వ. ఈ ప్రాంతాల్లోని ప్రజలు అనారోగ్యానికి గురైతే దవాఖానలకు వెళ్లడం వరకే కాలయాపన జరుగుతుంటుంది. ఇక సమీప దవాఖాన లకు వెళ్లేసరికి సంబంధిత మాత్రలు లేకపోవడం పరిపాటిగా మారింది. జిల్లాలోని పలు సంఘటనలు వైద్యశాఖ తీరుపై విమర్శలకు దారి తీసింది.
ఇదిలా ఉంటే విశాలమైన జిల్లా లో మందుల కొరతను తీర్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.3.60కోట్లతో సెంట్రల్ మె డికల్ స్టోర్స్‌ను మంజూరు చేసింది. బిజినేపల్లి మండలం పాలెం పీహెచ్సీ ఆవరణలో గతేడాది జూలై 30వ తేదీన పనులకు శంకుస్థాపన చేశారు. ఇది జరిగి ఏడాది కావస్తున్నా ప నులు పూర్తి కాలేదు. దీంతో మందులు మ హబూబ్‌నగర్ నుంచి వచ్చే వరకు కాలయాపన జరుగుతోంది. హైదరాబాద్ నుంచి మం దులు తీసుకొచ్చేందుకు ఒక వాహనం, అక్క డి నుంచి ఉమ్మడి జిల్లాకు పంపిణీ చేసేందు కు ఒక్క వాహనమే ఉంది. దీనివల్ల ఉమ్మడి జిల్లాలో మందుల రవాణాలో జాప్యం జరుగుతోంది. దీన్ని నివారించాలంటే డ్రగ్ స్టోర్ నిర్మాణాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉం ది. ఇక డెంగీ కిట్ల కొరత కూడా ఉంది. కిట్లు ముందస్తుగా పీహెచ్‌సీల్లో అందుబాటులో ఉంచకపోతే ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉ న్నది. వైద్యశాఖ అధికారుల లెక్కల్లో అన్ని ర కాల మందులు ఉన్నాయని పేర్కొంటున్నా.. వాస్తవంగా భిన్నంగా ఉందన్న అభిప్రాయా లు వినిపిస్తున్నాయి. జిల్లా దవాఖానలో పా ము, కుక్కకాట్ల మందులు అందుబాటులో ఉన్నాయని, గ్యాస్ గోళీలు రాంటడిన్ సైప్లె అవుతున్నాయని, డెంగీ కిట్లు సరిపోను ఉన్నాయని సూపరింటెండెంట్ రఘు తెలిపారు. అ త్యవసరమైన మందులను ఇండెంట్ పెట్టించి తెప్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు.