నారాయణపేట రూరల్, జూలై 9 : టీచ్ ఫర్ చేంజ్, వెనిరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండలంలోని కొల్లంపల్లి ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్‌రూంను మంగళవారం స్థానిక ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, సినీనటి, ఫౌండేషన్ సీఈవో మంచులక్ష్మి, ఫౌండర్ రత్నారెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంచులక్ష్మి మాట్లాడుతూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నా రాయణపేట నియోజకవర్గంలోని 4 మండలాల్లో 16 పాఠశాలలను డిజిటల్ తరగతులు బోధించేందుకు ఎంపిక చేసినట్లు తెలిపారు. రూ.50 లక్షలతో పను లు చేపడుతున్నామని వెల్లడించారు. వెనుకబడిన గ్రామాల్లో ఇలాంటి ప్రాజెక్టుల ద్వారా పేదలకు మేలు చేకూరుతుందన్నారు. అనంతరం 9, 10వ తరగతుల బాలికలకు ఆరు వేల శానిటేషన్ ప్యాడ్లు పంపిణీ చేశారు. అనంతరం ఎ మ్మెల్యే పర్ణికారెడ్డి మాట్లాడుతూ వెని ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిజిటల్ తరగతులను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో డీఈవో అబ్దుల్‌ఘని, ఏఎంవో విద్యాసాగర్, ఎంఈవో గోపాల్‌నాయక్ పాల్గొన్నారు.