మరికల్/కౌకుంట్ల, ఏప్రిల్ 30 : ‘కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇసుక మాఫియా పెట్రేగిపోతున్నది.. వా గులను గుల్ల చేస్తూ సంపదను లూటీ చేస్తున్నారు.. దందా యథేచ్ఛగా సాగుతున్నా రేవంత్ సర్కారు వారికి కొమ్ముకాస్తున్నది.. ఇసుక తరలించేందుకే ఊకచెట్టు వాగుపై బస్వాపూర్ సమీపంలో ఉన్న చెక్‌డ్యాంను ధ్వంసం చేసేందుకు కొందరు య త్నించారు’.. అంటూ దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ధ్వజమెత్తారు. మహబూబ్‌నగర్ జిల్లా బస్వాపూర్ గ్రామ సమీపంలో కాంగ్రెస్ నాయకులు, ఇసుక మాఫియా చెక్‌డ్యాంను ధ్వం సం చేసిన ప్రాంతాన్ని గురువారం రైతులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. వాగు వద్ద ధర్నాకు దిగారు. చెక్‌డ్యాంను ధ్వంసం చేసిన వారి ని వెంటనే అరెస్టు చేయాలని నిరసన వ్యక్తం చేశా రు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ నారాయణపే ట, మహబూబ్‌నగర్ జిల్లాల సరిహద్దులోని ఊకచెట్టు వాగుపై సాగునీరు అందించాలన్న లక్ష్యంతో నాటి సీఎం కేసీఆర్ సహకారం, పేట ఎమ్మెల్యే రా జేందర్రెడ్డితో కలిసి నిధులు మంజూరు చేయించి రెండు కిలోమీటర్లకు ఒకటి చొప్పున చెక్‌డ్యాం నిర్మించినట్లు గుర్తు చేశారు. దీంతో వేసవిలోనూ నీటితో చెక్‌డ్యాంలన్నీ జలకళను సంతరించుకున్నాయని తెలిపారు. కానీ ప్రభుత్వం వచ్చాక ప్రజాధనాన్ని ఇసుక మాఫియా ధ్వంసం చేస్తున్నదని ధ్వజమెత్తారు. బస్వాపూర్-రాకొండ మధ్య ఉన్న చెక్‌డ్యాంను అర్ధరాత్రి హిటాచీలతో దేవరకద్ర కాంగ్రె స్ నాయకులు అంజిల్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి అర్ధరాత్రి హిటాచీతో కూల్చడానికి యత్నించారని ఆరోపించారు.
దీంతో అప్రమత్తమై న రాకొండ గ్రామానికి చెందిన రైతు మొగులప్ప ప్రాణాలకు తెగించి అడ్డుకొని చెక్‌డ్యాంను కాపాడారని తెలిపారు. రైతుతో పాటు నీటిపారుదల శాఖాధికారులు, కాంట్రాక్టర్ దేవర్కద్ర పోలీసులకు ఫి ర్యాదు చేసినా పోలీసులు ఎందుకు వారిని అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే, ఎస్పీ, సీఐ, ఎస్సైలు అధికార యంత్రాంగానికి తలొగ్గుతున్నారని విమర్శించారు. ఇసుక మాఫియాను అరికట్టడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
గత బీఆర్ఎస్ పాలనలో రైతుల సంక్షేమానికి చెక్‌డ్యాంలను నిర్మిస్తే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం విస్మరించి ప్రజల ఆస్తులను కొల్లగొడుతున్నదని విమర్శించారు. పెద్దరాజమూర్లో జేసీబీ పెట్టి బెంజ్ లారీలతో అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తు న్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. రూ.5.80 కోట్లతో నిర్మించిన చెక్‌డ్యాంను కాపాడిన రైతు మొగులప్పను అందరూ అభినందించాలన్నారు.
చెక్‌డ్యాంల నిర్మాణంతో దేవరకద్ర, మరికల్, ధన్వాడ, చిన్నచింతకుంట మండలాల్లో రైతులకు రెండు పంటలకు సాగునీరు అందుతుందని తెలిపారు. ఐదేళ్ల కిందట నిర్మించిన చెక్‌డ్యాంలో ఏప్రిల్ చివరి నా టికి పూర్తిస్థాయిలో నీరు నిల్వ ఉండడంతో రైతులకు కేసీఆర్ పాలన గుర్తు చేసుకున్నారని చెప్పారు. ఈ ప్రాంతంతో సుమారు 20 వేల ఎకరాలకు రెండు పంటలకు సాగు నీరు అందుతుందన్నారు. మరికల్ఠ మండలంలోని రాకొండ ప్రాం తంతో భూగర్భ జాలాలు గణనీయంగా పెరిగాయన్నారు.
ఇసుక మాఫియాను అరికట్టడంలో ఆధికార యంత్రంగం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే విమర్శించారు. పెద్ద రాజమూరులో జేసీబీ పెట్టి టిప్పర్లు, లారీలలో అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్నా అ ధికార యంత్రాంగం ఎందుకు పట్టించుకోడం లేదని ప్రశ్నించారు. ఇసుక అక్రమ రవాణా లో అధికారులకు భాగం ఉందని ఆరోపించారు. రైతులు పండించిన పంటలను కొనుగోలు చేసేందుకు కేంద్రాలు ప్రారంభించే దిక్కు లేకుండా పో యిందన్నారు. పంట నష్టపోయి.. కొనుగోళ్లు జరగక.. పడిగాపులు కాస్తూ.. వర్షంలో ధాన్యం తడుస్తుంటే.. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కండ్ల ముందే పాడవుతుంటే చూసి కంటతడి పెడ్తున్నారని ఆవేదన చెందారు. ముఖ్యమంత్రికి రైతులమీద చిత్తశుద్ధి ఉంటే వారి సంక్షేమానికి కృషి చేయాలని కోరారు. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదనే సామెను ఆయన గుర్తు చేశారు.
రైతులకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో గత కేసీఆర్ ప్రభుత్వంలో రూ.6 కోట్లతో నిర్మించిన చెక్‌డ్యాంను ఇసుక మాఫియా కూల్చే యత్నం చేసిందని, ఇందుకు కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆల డిమాండ్ చేశారు. వాగులో కూర్చొని రైతులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి ధర్నా చేపట్టారు. వారిపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నర్సింహారెడ్డి, శ్రీకాంత్, రాకొండ సర్పంచ్ పుల్లప్ప, నరహరితోపాటు రైతులు పాల్గొన్నారు.