ప్రశ్న : కాంగ్రెస్ వస్తే ధరణిని తీసేసి భూమాత పోర్టల్‌ను తెస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అంటున్నారు? ధరణి ఉండాలా? లేక భూమేత కావాలా?
రైతు : తొమ్మిదేండ్ల కిందట మా పెద్దల భూమిని నా పేర చేసుకోవడానికి నానా ఇబ్బందులు పడ్డాను. మా నాన్న భూముల విషయంలో నిర్లక్ష్యం చేయొద్దని చెప్పారు. సీఎం కేసీఆర్ సారు ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చాక వారసత్వంగా రావాల్సిన ఐదెకరాలను నా పేర కొన్ని గంటల వ్యవధిలోనే మార్చుకున్నాను. ధరణిని అన్ని వర్గాల వారు మెచ్చుకుంటున్నారు. అది తీసేస్తే రైతులు ఆగమైతరు. మళ్లీ పటేల్, పట్వారీ వ్యవస్థ వస్తుంది. మన భూముల వివరాలు కావాలన్నా పట్వారీల ఇంటి చుట్టూ తిరగాల్సి వస్తుంది. సీఎం కేసీఆర్ సారు ధరణిని తీసుకొచ్చి మంచి పని చేశారు. ఇప్పుడు మన భూముల వివరాలు ఏవీ కావాలన్నా క్షణాల్లో ధరణి పోర్టల్‌ను ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది. అన్ని వివరాలు అద్దంలా పొందుపరిచారు.
ప్రశ్న : ధరణిని తీసేసి ఖాస్తుదారు కాలంలో అనుభవందారు కాలం పెడ్తామని అంటున్నారు? అలా చేస్తే రైతులకు మేలు జరుగుతుందా? నష్టమా?
రైతు : రైతుల భూములన్నీ తలకిందులు అవుతాయి. గ్రామాల్లో భూ పైరవీకారులు పుట్టుకొస్తారు. ఎవరికైనా భూమి విక్రయించి పట్టాచేయాలంటే దళారులను ఆశ్రయించాల్సి వస్తుంది. గతంలో భూముల పట్టాలు చేసుకోవాలంటే పట్వారీలకు లంచాలిస్తేనే పహాణీలు, ఆర్వోఆర్లు ఇచ్చేవారు. అన్నీ అయ్యాక చేయి తడపనిదే పాసుపుస్తకం వచ్చేది కాదు. సీఎం సారు ధరణి పోర్టల్‌ను ప్రవేశపెట్టిన తర్వాత రైతులకు వరంగా మారింది. పైరవీకారుల బెడద తగ్గింది. భూమి విక్రయించినా, కొనుగోలు చేసినా స్లాట్ బుక్ చేసుకొని ఇచ్చిన టైమ్‌కు నేరుగా తాసీల్దార్ కార్యాలయానికి వెళ్లి అవసరమైన డాక్యుమెంట్స్ ఇస్తే గంటలోపే రిజిస్ట్రేషన్ అవుతుంది. మ్యుటేషన్ కష్టాలు కూడా తీరాయి. ధరణి పోర్టలే బాగుంది. భూమాత వస్తే భూబకాసురులు తయారవుతారు.
సీఎం కేసీఆర్ రైతు శ్రేయస్సు కోసం ప్రవేశపెట్టిన ధరణిని.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రద్దు చేసి భూమాత పోర్టల్ తీసుకొవస్తానని చెబుతున్నది. ధరణిని రద్దు చేస్తే మళ్లీ రాబంధుల రాజ్యం వస్తుంది. శవాలను రాబంధులు పిక్కుతిన్నట్లు దళారులు రైతుల వద్ద ఇష్టారీతిలో డబ్బులు లాగుతారు. పట్వారీ వ్యవస్థ ఉన్నప్పుడు పహాణీ మొదలుకొని ప్రతి చిన్న దానికి డబ్బులు ఇస్తేనే పని జరిగేది. ఆ వ్యవస్థ రద్దయి ధరణి వచ్చాక పొలానికి సంబంధించి ఎలాంటి పనులైనా దళారుల ప్రమేయం లేకుండా చకచకా జరిగిపోతున్నాయి. ధరణి వ్యవస్థ ఉన్నందుకే మా భూములు భద్రంగా ఉన్నాయి. కొనుగోళ్లు, అమ్మకాలు జరిగితే రిజిస్ట్రేషన్లు పారదర్శకంగా జరుగుతున్నాయి. కాంగ్రెసోళ్లు భూమాత పోర్టల్ తెచ్చి మళ్లీ పాత విధానం అమలు చేస్తామంటున్నారు. అలా చేస్తే రైతుల జుట్టు దళారుల చేతిలోకి పోతుంది. ఇబ్బందులు పడాల్సి వస్తుంది. రైతుల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న కేసీఆర్ సర్కార్ వస్తేనే తమ తలరాత బాగుంటుంది. తామంతా బీఆర్ఎస్ వెంటే ఉంటాం.
దుక్కి దున్ని, పంట పండించి, చెమటోడ్చిన రైతుకే భూమి విలువ తెలుస్తది. భూమి అంటే అండదండగా ఉండే తండ్రి.. కడుపు నిండా అన్నం పెట్టే తల్లివంటిది. కాంగ్రెస్ హయాంలో చెరువు కింది భూములను కాంగ్రెస్ నాయకులు దొంగతనంగా వారి పేర్ల మీద మార్చుకుని లక్షల రూపాయలు ముంపు భూములుగా చూపి పైసలెత్తుకున్నరు. అందులో వేరే వాళ్ల పేరు మీద ఉన్న భూములను కూడా తమ పేర ఎక్కించుకుని నష్టపరిహారం తిన్నరు. అప్పుడే ధరణి ఉండింటే వాళ్ల కథలు నడిచేవి కావు. కేసీఆర్ కూడా రైతుబిడ్డ కాబట్టే ధరణిని తీసుకొచ్చి మాలాంటి పేద రైతులకు భూమిపై భరోసా ఉండేలా చేసిండు. పూర్వం పల్లెల్లో కొంత భూమిని బిచ్చగాళ్లు, సంచార జాతులోళ్లకు ఇచ్చేవాళ్లు. వాళ్లు ఒక్కోసారి ఊరు వదిలి పోతే మళ్లీ రానిక్కె ఐదేండ్లు అట్లా పట్టేది. వారి భూమి వేరేవాళ్లు తీసుకోకుండా ఊరి పెద్దలు పెద్ద బండరాయి మీద వారి పేరు చెక్కించి వారికి కేటాయించిన పొలాల సరిహద్దుల్లో ఉంచెటోళ్లు. అట్లా రైతు భూమిని ఎవ్వడన్నా కొంచెం గెట్లు జరిపి ఆక్రమించుకోవచ్చేమో కానీ.. కంప్యూటర్లో రికార్డయిన సెంటు భూమిని కూడా రైతు ప్రమేయం లేకుండా ఎక్కించుకోలేడు. అదే కేసీఆర్ రైతులకిచ్చిన పెద్ద వరం. ధరణిని తీసేయాలని కబ్జాల కాంగ్రెస్ నాయకుడు, మూటల దొంగ రేవంత్ అంటుండు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే కచ్చితంగా మా భూములు బడాబాబుల ఖాతాల్లో చేరుతయి. ధరణిని తీసేసే ఓటుకు నోటు దొంగ నాయకుడి ప్రభుత్వం కంటే రైతులను కంటికి రెప్పలా చూసుకున్న కేసీఆర్ సార్ ఉంటేనే మా భూమి మాకుంటది. మా రైతుబంధు మా అకౌంట్ల ఉంటది. మా పంటల పైసలు మా చేతికందుతవి. రైతులకు కారు పార్టీ, కేసీఆర్ తప్పా మరొకరు వద్దే వద్దబ్బా..
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో చాలా మేలు జరిగింది. గతంలో రికార్డులు తారుమారయ్యేవి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోగానే తమ పేరు రికార్డులో నమోదవుతుంది. దీంతో ఎవరి వద్దకు తిరగాల్సిన పనిలేదు. ధరణి ఉంటేనే రైతుకు మేలు. ధరణి లేకపోతే రిజిస్ట్రార్ ఆఫీసులు, పట్వారీల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంటది. సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన ధరణితో ఎన్నో గొడవలు బంద్ అయినవి. పోర్టల్ వద్దంటున్న కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెబితేనే ఇంకోసారి మాట్లాడకుండా ఉంటారు. ఏదేమైనా సీఎం కేసీఆర్ రైతుల పక్షాన నిలబడే వ్యక్తి. ఆయనతోనే రైతుల సంక్షేమం.
పట్వారీ వ్యవస్థ వస్తే మంచిగున్న రికార్డులన్నీ మళ్లీ తారుమారు చేసి రైతులను గోసపెడుతరు. రికార్డుల్లో ఒకరి పేరు ఉంటే మరొకరి పేరును చేర్చి తలకాయలు పగలగొట్టుకునే పరిస్థితి వస్తది. మా పెద్దలు సంపాదించిన భూమినే ఒక పట్వారీ మరొకరి పేరుపై మారిస్తే కాళ్లు అరిగేటట్టు తిరిగిన. మా తాతల పేరుపై ఉన్న భూమిని మా పేర చేయడానికి పడని కష్టం అంటూ లేదు. మళ్లీ పట్వారీ వ్యవస్థ వస్తే ఇంక భూముల సంగతి అంతే. చిన్న కాగితం కావాలన్నా కావలికారి నుంచి మొదలుకొని పట్వారీ అందరికీ సలాంలు కొడుతూ తిరగాల్సి వస్తుంది. ధరణి వచ్చిన తర్వాత భూములు భద్రంగా ఉన్నాయి. ధరణి తీసేస్తే లేని భూ సమస్యలు పెరిగి ఎంతో మంది రైతులు చనిపోయే పరిస్థితి వస్తది. కాంగ్రెస్ పార్టీ కన్నా ధరణియే ఉండాలని అనుకుంటున్నాం. చాలా మంది రైతులు కేసీఆర్‌కి ఈ విషయంలో దేవుడిలా మొక్కుతారు.
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి ద్వారా మాకు ఉన్న భూమి ఆన్లైన్లో ఎక్కింది. ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేవు. ధరణఙ తీసేస్తే మా భూముల వివరాలు మాకు తెలియవు. మాకు తెలియకుండా అధికారులు భూములను ఇతరుల పేరుపై మార్చే అవకాశం ఉంటుంది. గతంలో అనేక మంది రైతుల భూములు ఇతరుల పేర్లపై మార్చిండ్రు. పట్వారీలతో పైరవీలు చేసేందుకు రైతులకు చేత కాదు. పట్టా పాస్బుక్ల కోసం కాళ్లరిగేలా తిరిగినా వచ్చేవి కావు. అధికారులు లంచం తీసుకొని నాయకులకు ఇచ్చేవారు. కేసీఆర్ సారు దయతో భూమి కొన్నా.. అమ్మినా వాటి వివరాలు గంటలో మాకు తెలుస్తాయి. మా ఫోన్లకు మెస్సేజ్ వస్తుంది. ఏ ఇబ్బందులు లేకుండా ఇంటికే పట్టాపాస్‌బుక్‌లు వస్తాయి. పైరవీలు, లంచం ముచ్చటే లేదు. ధరణి తీస్తే భూములు రైతులకు దక్కవు. కాంగ్రెస్ నేతలు రైతులను మోసం చేయాలని చూస్తున్నారు. ధరణితో మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. పట్వారీ వ్యవస్థతోనే కష్టాలన్నీ.. అందుకే బీఆర్ఎస్కే మా మద్దతు.