అయిజ, జనవరి 22 : జనమే జయ మహారాజు (అర్జునుని మనవడు)చే ప్రతిష్ఠితమైన గణపతి అంశ సంభూతులైన గోపాలదాసుల వారిచే స్థుతించి, సే వించబడిన ధన్వంతరి వేంకటేశ్వర స్వామి భక్తుల పా లిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు. ఉత్తనూ రు గ్రామంలో ఉన్న ధన్వంతరి వేంకటేశ్వరస్వామి భ క్తుల ఇలవేల్పుగా పేరుగాంచింది. ఏటా మాఘశుద్ధ తదియ నుంచి మాఘ శుద్ధ సప్తమి వరకు బ్రహ్మోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఇందుకుగానూ ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల ను పురస్కరించుకుని వేంకటేశ్వరస్వామి ఆలయంతోపాటు భీమేశ్వరాలయం, ఆంజనేయస్వామి ఆల యం, గోపాలదాసుల నివాసాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. మంగళవారం నుంచి ఈ నెల 30 వరకు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నా రు. వీఐపీలు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఆలయ ప్రాశస్త్యం..
ధన్వంతరి వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఐదు వేల ఏండ్ల కిందట అర్జునుడి మునిమనవడు జనమేజయ మహారాజు నిర్మించినట్లు పురావస్తు శాఖ ఆధారాలు ఉన్నాయి. ధన్వంతరి వేంకటేశ్వరస్వామి అంటే వైద్యులు అని అర్థం. చరిత్ర ఆధారాలను బట్టి జనమేజయ మహారాజు తండ్రి పరీక్షిత్ మహారాజు శాప విమోచన కోసం ఈ ఆలయం నిర్మించారనే ఆధారాలు ఉన్నాయి. పరీక్షిత్ మహారాజు ఒక రోజు వేటకు వెళ్లిన సమయంలో దాహం తీర్చుకునేందుకు శమేక రుషి తపస్సు చేస్తున్న ప్రదేశానికి చేరుకుని దాహం తీర్చుకోవడానికి ప్రయత్నించాడు.
అక్కడ మహారుషి ధ్యానంలో ఉండగా పరీక్షిత్ మహారాజు రాకను గమనించలేదు. దీంతో కోపోద్రిక్తుడైన మహారాజు ఆ ప్రాంతంలో చచ్చిపడి ఉన్న పామును తపస్సు చేస్తు న్న రుషి మెడలో వేశాడట. అది తెలుసుకున్న చుట్టుపక్కల వారు రుషి కుమారుడైన శృంగినికి తెలిపారట. దీంతో ఆ ప్రదేశానికి చేరుకున్న శృంగి తండ్రికి చేసిన అవమానానికి పరీక్షిత్ మహారాజును శపిస్తాడట. తపస్సు నుంచి మేలుకున్న రుషి జరిగిన విషయాన్ని తెలుసుకొని పరీక్షితుడికి క్షమాపణ చెప్పాడట.
పరీక్షిత్ మహారాజు రాకను గమనించకపోవడం మంచిది కా దని ఇంత మాత్రానికి శపించడం సబబుకాదని కు మారుడితో రుషి అన్నాడట. శాప విమోచనం కోసం రుషి భగవతాశ్రవణం చేస్తాడట. ఆయన ఏడు రోజుల్లో సర్పకాటుకు గురై మరణిస్తాడు. తండ్రికి జరిగిన కీడుకు జనమే జయుడు సృష్టిలో ఉన్న సర్పాలన్నీ అంతరించిపోవడానికి సర్పయాగం చేస్తాడట. దీంతో సృష్టిలో ఉన్న సర్పాలన్నీ యాగంలో వచ్చిపడి చనిపోతుండగా విషయం గమనించిన దేవతలు, రుషు లు, సృష్టి వ్యతిరేక చర్యలు ఆపాలని జనమే జయుడిని కోరతారట.
దీంతో జ్ఞానోదయం కలిగి తానింత వరకు చేసిన సర్పయాగ దోష నివారణకు రుషుల ఆదేశానుసారం అక్కడక్కడ వేంకటేశ్వర స్వామి ఆలయాలను నిర్మించి, విగ్రహాలను ప్రతిష్ఠించాలని కోరడంతో జనమే జయుడు వేంకటేశ్వరస్వామి ఆలయాలను నిర్మించాడట. అందులో భాగంగానే ఉత్తనూరులో ధన్వంతరి వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాడనే చరిత్ర ఆధారాలు ఉన్నాయి. మరో చరిత్ర ఏమంటే గణపతి అంశ సంభూతులైన గోపాలదాసులు ఈ ఆలయంలో భజన చేస్తుండగా సా క్షాత్తు ఆ వేంకటేశ్వర స్వామి నాట్యం చేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తున్నది. ఇంతటి చరిత్ర కలిగిన ఈ ఆలయం నేడు దినదినాభివృద్ధి చెందుతూ జిల్లాలో ఒక పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్నది.