మొహర్రం పండుగను బుధవారం ఉమ్మడి జిల్లాలోని ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. పెద్ద ఎత్తున జరిగే కోయిలకొండ, ఊట్కూరు, తిమ్మాజిపేట జనసంద్రంగా మారాయి. అలాగే ఆయా గ్రామాల్లో పీర్ల చావిడీలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.
మలీజా సిద్ధం చేసి పీర్లకు నైవేద్యం సమర్పించారు. మొక్కుబడుల్లో భాగంగా కందూర్లు నిర్వహించారు. సవారీలు కనువిందు చేయగా.. అగ్నిగుండంలో భక్తులు నడిచారు. యువకుల అలయ్.. బలయ్, మహిళల బొడ్డెమ్మలు ఆకట్టుకున్నాయి.అనంతరం నిమజ్జనంతో ఉత్సవాలు ముగిశాయి.