భూత్పూర్: దేవరకద్ర నియోజకవర్గం పరిశ్రల స్థాపనకు అనుకూలంగా ఉంటుదని, ఇందుకు అవసరమై పొలాలు కూడా ఉన్నాయని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో జీరో అవర్‌లో మాట్లాడారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ భూత్పూర్ మండలంలో 170 ఎకరాల స్థలం, మూసాపేట మండలంలో 150 ఎకరాల స్థలం పరిశ్రలకు అనుకూలంగా ఉందని మంత్రి కేటీఆర్‌కు విన్నవించడం జరిగిందని ఆయన తెలిపారు.
ఇందుకు సంబంధించి అధికారులు సైతం ఏరియాను క్షుణంగా పరిశీలించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. వెంటనే పరిశ్రమ లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.