వనపర్తి టౌన్, ఏప్రిల్ 2 : కేసీఆర్ హయాంలోనే గ్రామాల వికా సం జరిగితే రేవంత్ హయాంలో విధ్వం సం జరిగిందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్ విమర్శించారు. గురువారం జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి స్వగృహాంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గాంధీజీ కలలు గన్న ట్లు దేశానికి పల్లెలే పట్టుగొమ్మలు అన్న నినాదాన్ని నిజం చేసిన నాయకుడు కేసీఆర్ అని గుర్తు చేశారు. నాడు గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత , హరితహారం కార్యక్రమాలు చేపట్టడం వల్ల అడవుల శాతం పెం చి పల్లె ప్రకృతిని కాపాడి ప్రజల ఆ రోగ్యాన్ని కాపాడారన్నారు.
పారిశుధ్య కార్మికులను పెంచి ప్రతి రో జూ గ్రామాలు పరిశుభ్రంగా ఉంచారని, ప్రతి గ్రామానికి రూ.10లక్షలు కేటాయించి ట్రాక్టర్ కొనుగోలు చేసి తాగునీటి ట్యాంకర్ రూ.1.5లక్షలతో కొనుగోలు చేసి మొక్కలను కాపాడారని గుర్తుచేశారు. మన ఊరు-మన బడి పేరుతో పాఠశాలలను బాగు చేయడం, సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించడం, గ్రామాల్లో యుద్ధ ప్రాతిపాదికన చెరువులకు మరమ్మతులు, వాటర్షెడ్లు నిర్మించి వ్యవసాయాన్ని పండుగలా చేశారని అన్నారు. కానీ రేవంత్ హయాంలో సకాలంలో ఎన్నికలు నిర్వహించకుండా రెండున్నల సంవత్సరాలు కాలయాపన చేసి న్యాయవ్యవస్థలు మొట్టి కాయలు వేస్తే ఎన్నికలు నిర్వహించారని అన్నారు.
24గంటల కరెంట్, రైతుభరోసా, రైతుబీమా ఇచ్చిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు. కాంగ్రెస్ హ యాంలో యూరియా కొరతలు, ఎండిన పంటలు, పాడి రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఎద్దేవా చేశా రు. అందుకే ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక అంటూ గ్రామాలకు వచ్చే కాంగ్రెస్ నాయకులు, అధికారులను అభివృద్ధిపై ప్రజలు నిలదీయాలన్నారు. ముఖ్యంగా మహిళలకు ఇస్తామన్నా రూ.2500, ఆసరా పింఛన్, రూ.4వేలు, రైతు భరోసా, రైతు రుణమాఫీ, నిరుద్యోగులకు 2లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని నిలదీయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు అశోక్, మాణిక్యం, రఘువర్ధన్‌రెడ్డి, ధర్మానాయక్, పరంజ్యోతి, నారాయణ, నీలస్వా మి, వెంకటసాగర్, చిట్యాల రాము, జోహెబ్హుస్సేన్, రుప్లా నాయక్ తదితరులు ఉన్నారు.