మహబూబ్‌నగర్ కలెక్టరేట్, నవంబర్ 21 : పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డిగ్రీ కళాశాలల్లో సెమిస్టర్ 1, 3, 5 రెగ్యులర్ అండ్ బ్యాక్లాగ్ పరీక్షలను ఈ నెల 22 నుంచి డిసెంబర్ 16 వరకు నిర్వహించనున్నారు. ఇందుకు సంధించి ఇప్పటికే వర్సిటీ షెడ్యూల్ విడుదల చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 19,191 మంది విద్యార్థులు హాజరవుతుండగా 47 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు సం బంధించిన మెటీరియల్‌ను ఇప్పటికే కేం ద్రాలకు సరఫరా చేశారు. పరీక్షల నిర్వహణకు సిట్టింగ్ స్కాడ్తోపాటు ప్లయింగ్ స్కాడ్ బృందాలను ఏర్పాటు చేశారు.
పాలమూరు యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 22 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై పీయూ పరీక్షల నిర్వహణ అధికారులు ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవే ట్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, ముఖ్య పర్యవేక్షకులతో సమావేశాలు నిర్వహించి పలు సూ చనలు చేశారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు ఉండాలని సూచించారు.
ఈ నెల 22నుంచి బీఏ(సీబీసీఎస్) సెమిస్టర్-5 రెగ్యూలర్, బ్యాక్లాగ్, ఇంప్రూ వ్మెంట్ పరీక్షలు, బీఏ (సీబీసీఎస్) సెమిస్టర్-1 రెగ్యూలర్, బ్యాక్లాగ్, ఇంప్రూవ్మెంట్ పరీక్షలు ప్రా రంభం కానున్నాయి. ఈ నెల 24నుంచి బీఏ(సీబీసీఎస్) సెమిస్టర్-3 రెగ్యులర్, బ్యాక్లాగ్, ఇంప్రూవ్మెంట్ పరీక్షలు, నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ (బీఎస్సీ బీఈడీ, బీఏ బీఈడీ) సెమిస్టర్-3 పరీక్షలు రెగ్యూలర్, బ్యాక్లాగ్, ఇంప్రూవ్మెంట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
ఈ నెల 25 నుంచి నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ (బీఎస్సీ బీఈడీ, బీఏ బీఈడీ) సెమిస్టర్-1 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా 47 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 19,191 మంది పరీక్షలకు హాజరవుతుండగా సెమిస్టర్-1 లో 18,966 మంది, సెమిస్టర్-3లో 7,000, సెమిస్టర్-5లో 8,000 మంది విద్యార్థులు హాజరు కానున్నారు.
పకడ్బందీగా ఏర్పాట్లు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పీయూ పరిధిలో నిర్వహించే డిగ్రీ సెమిస్టర్ 1, 3, 5 రెగ్యూలర్, బ్యాక్లాగ్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఈ నెల 22 నుంచి డిసెంబర్ 16 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్షలు సజావుగా జరిగేలా అన్ని కేంద్రాలకు వైస్‌చాన్స్‌లర్ జీఎన్ శ్రీనివాస్ ఆదేశాలతో సిట్టింగ్ స్కాడ్, ప్లయిం గ్ స్కాడ్ బృందాలను ఏర్పాటు చేశాం. పరీక్షా కేంద్రాల్లో ఏమైనా పొరపాట్లు జరిగితే ఆయా పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్స్ బాధ్యత వహించాల్సి ఉం టుంది.
– డా.కె.ప్రవీణ, పరీక్షల నిర్వహణ అధికారిణి,పాలమూరు యూనివర్సిటీ