మాగనూరు, సెప్టెంబర్ 15 : మండల కేంద్రంలోని పెద్ద వాగులో నీటి ప్రవాహనికి 12గ్రామాలకు నీరందించే మిషన్ భగీరథ పైప్లైన్ తెగి దాదాపు 20రోజులు తాగునీటికి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయమై ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ఈనెల 10వ తేదీన తాగునీటి సమస్యపై ‘దెబ్బతిన్న పైపులైన్’ అనే కథ నం ప్రచురితమైంది.
దీంతో డీఈ వెంకట్రెడ్డి ఆదివారం స్పం దించారు. పెద్దవాగులో మాగనూరు, కృష్ణ ఉమ్మడి మండల వ్యా ప్తంగా తాగునీటిని సరఫరా చేసే మిషన్ భగీరథ కనెక్షన్ పైప్లైన్ ను డీఈ వెంకట్రెడ్డి పరిశీలించారు. వెంటనే మరమ్మతులు చేప ట్టి తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.