గట్టు : గద్వాల జిల్లా గట్టు మండలంలోని లింగాపురం శివారులో ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలి డీసీఎం వ్యాన్ ( DCM Van ) దగ్ధమయ్యింది. శనివారం ఓ రైతు పొలంలో బొప్పాయిలు అన్లోడ్ చేస్తున్న డీసీఎంకు 11 కెవి విద్యుత్ వైర్లు ( Power Lines ) తగిలింది. దీంతో అగ్ని ప్రమాదం సంభవించి డీసీఎం డీజిల్ ట్యాంక్ పేలి వ్యాన్ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో డ్రైవర్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. మనుషులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. విద్యుత్ వైర్లు పూర్తిగా కిందకు ఉండడంతో ప్రమాదం జరిగిందని సమాచారం.