అచ్చంపేట టౌన్, జనవరి 13 : ఎటు చూసినా పచ్చని చెట్లు.. పక్షుల కిలకిలరావాలు.. ఎత్తైన కొం డలు.. జాలువారే జలపాతాలు.. కృష్ణానది అందా లు.. అటవీ జంతువులు.. ఇలా ప్రకృతి రమణీయ దృశ్యాలు నల్లమల అడవుల్లో కనివిందు చేస్తుంటా యి. దేశంలోని హిమాలయాల తర్వాత దక్షిణ భా రతీయులు నల్లమల కొండలను అతి పవిత్రంగా భావిస్తారు. ఈ కొండల్లో 500 అడుగుల ఎత్తున కొలువై.. శ్రీశైల ఉత్తర ద్వారంగా ఉమామహేశ్వర క్షేత్రం విరాజిల్లుతున్నది. శ్రీశైల క్షేత్రానికి ఉత్తర ద్వారం, ఉమాశక్తి పీఠంగా ఉమామహేశ్వర స్వామి దేవస్థానం ప్రసిద్ధి గాంచినది. శ్రీరాముడు రావణాసుర వదనానంతరం శ్రీశైల ప్రదక్షిణం ఈ క్షేత్రం నుంచే ప్రారంభించినట్లు పురాణాలు చెబుతున్నా యి.
ఉమామహేశ్వర క్షేత్రం రెండో శ్రీశైలంగా పిలవబడుతున్నది. కాకతీయుల కాలంలో ఈ క్షేత్రం మహా వైభవంగా ఉన్నట్లు పండితారాధ్య చరిత్ర ప్ర కారం తెలుస్తున్నది. పండితారాధ్యుడి శిష్యుడు దోన య్య ఈ దారినే శ్రీశైలానికి వెళ్లినట్లు చెబుతారు. ఉమామహేశ్వరం ఒక (పురం) ఊరుగానే ఉన్నట్లు అప్పటి శిలా శాసనాల ప్రకారం స్పష్టమవుతున్నది. ఉమామహేశ్వరం కొండ కింద స్థలానికి భోగ మహేశ్వరం అని పేరు. పూర్వం యాత్రికులు కొండపైకి వెళ్లి స్వామి వారిని దర్శించుకొని తిరిగి కొండ కిందకు వచ్చి వంటలు చేసుకునేవారు. అప్పుడు ఇక్కడ ఒక గ్రామం కూడా ఉన్నది.

కానీ, ప్రస్తుతం అటవీ ప్రాంతం తప్పా ఊరు కానరాదు. క్రీ.శ. 1280లో కరణం రామయ్య భోగమహేశ్వరంలో కాకతీయ రుద్రమదేవి పేర చలమర్తి గండరుద్రేశ్వర ప్రతిష్ఠ చేశారు. అప్పుడు ఆయన భార్యలు మల్లసాని అమరనాథ దేవర, చెన్న సోమనాథ దేవర, చెన్న మల్లనాథ, సోమేశ్వర దేవరల పేర 5 గదులు నిర్మించి లింగ ప్రతిష్ఠ చేయించాడు. నేడు ఆ ద్వారాలు శిథిలావస్థకు చేరుకోవడంతో నూతన ఆలయ నిర్మాణం, విగ్రహాల (లింగాలు)ను ప్రతిష్ఠించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉమామహేశ్వరంలో 11 తీర్థములు ఉన్నాయి. ఈ తీర్థాలలో రుద్రధార, భస్మధార, గౌరిధార, పాపనాశనం ముఖ్యమైనవి.
ఇవన్నీ నిరంతరం పారే జలధారలు. పాపనాశనంలో స్నానమాచరిస్తే సకల పాపాలు, దోషాలు, రోగ, బాధల నుంచి విముక్తి పొందుతారని భక్తుల నమ్మకం. పాపనాశనం అనే చిన్న గుండంలో ఎన్ని నీళ్లను తీసినా వస్తూనే ఉంటాయి. ఇక్కడ అణువంత దానం చేసినా ఎంతో మందికి దానం చేసినంత పుణ్యం లభిస్తుందని నమ్మకం. ఈ క్షేత్రంలో రాత్రి నిద్ర చేస్తే కాశీ, గయ, ప్రయాగ పుణ్యక్షేత్రాల్లో బస చేసినంత భాగ్యం కలుగుతుందని విశ్వాసం. అచ్చంపేట మండలంలోని రంగాపూర్ గ్రామానికి చెందిన మర్యాద గోపాల్‌రెడ్డి 1954 నుంచి ఆలయాన్ని దివ్యసుందర క్షేత్రంగా తీర్చిదిద్దుతున్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ హయాంలో అభివృద్ధి పనులు చురుకుగా సాగుతున్నాయి. ఇప్పటికే భోగమహేశ్వరం నుంచి ఉమామహేశ్వరం వరకు భక్తుల సౌకర్యార్థం నూతనంగా రాతి మెట్లు ఏర్పాటు చేశారు. సెక్యూరిటీ గదులు, భక్తులు సేద తీరేందుకు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు గదులు నిర్మిస్తుండగా, పనులు దాదాపుగా పూర్తయ్యాయి.