అచ్చంపేట రూరల్ : అచ్చంపేట నియోజకవర్గ కేంద్రం 132 సబ్ స్టేషన్లో ట్రాన్స్ఫార్మర్ల ( Transformer ) మరమ్మతు కేంద్రం ఆవరణలో శనివారం అజాగ్రత్త తో పనిముట్ల వ్యర్ధాలు కాలిపోయాయి. కాపర్, రాగి తీగలతో పాటు ఇనుప వస్తువులు అమ్ముకోవడం కోసం మరమ్మతు సిబ్బంది కాపర్( Copper ) , రాగి తీగల కోసం దహనం చేశారు. దీంతో మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
విద్యుత్ సబ్ స్టేషన్, ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుల కేంద్రాలకు అడుగుల దూరములో ప్రమాదకరముగా మంటలు చెలరేగుతున్న ఎవరూ పట్టించు కోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు సబ్స్టేషన్, మరమ్మతుల కేంద్ర సమీపంలో మంటలు పెట్టకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయమై విద్యుత్ ఏఈ ఆంజనేయులును వివరణ కోరగా తనకు విషయం తెలియదని, విచారణ చేపట్టి నిర్లక్ష్యంగా ప్రమాదకరంగా మంటలు పెట్టిన సిబ్బంది పై చర్యలు తీసుకుంటామని అన్నారు.