వెల్దండ, మార్చి 10 : పెండింగ్ పాల బిల్లులు చెల్లించాలని, చేతకాకపోతే వెంటనే గద్దె దిగిపోవాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నె లల పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం వెల్దండ మండలం పెద్దాపూర్ గేటు వద్ద హైదరాబాద్- శ్రీశైలం జాతీ య రహదారిపై పాడి రైతులు రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకోతో ఎక్కడికక్కడ భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా పాడి రైతులు మాట్లాడుతూ రా త్రింబవళ్లు కష్టపడి, అప్పులు చేసి పశుగ్రాసం తెచ్చి విజయ్ డెయిరీకి పాలు పోస్తే 3నెలలుగా బిల్లులు చెల్లించకుంటే ఎలా బతకాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
గతంలో ఏనాడు లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాడి రైతులు రోడ్డెక్కే దుస్థితి దాపురించిందని ఆరోపించారు. పాలించడం చేతకాకపోతే ఎందుకు ఉండాలని, వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. రైతు ప్రభు త్వం అనే చెప్పుకునే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకా, రైతులను మోసగించిందని మండిపడ్డారు. రాస్తారోకో విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయని విద్యార్థులకు ఇబ్బందులు కలించవద్దని సూచించగా పాడి రైతులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శంకర్‌నాయక్, నా యకులు, రైతులు వెంకట్‌రెడ్డి, యాదయ్య, శేఖర్, అమరేందర్, వీరారెడ్డి, పర్వతాలు, అయ్యన్న, పర్వతాలు, తిర్పతయ్య, వెంకటయ్య, బాపు, ఇదమయ్య, శ్రీను తదితరులు ఉన్నారు.
ఊర్కొండ, మార్చి 10 : పెండింగ్‌లో ఉన్న పాలబిల్లులు వెంటనే చెల్లించాలని పాడి రైతులు డిమాండ్ చేశారు. మండలంలోని ఊర్కొండపేట, బొమ్మరాజుపల్లి, ఇప్పపహాడ్ గ్రామాల్లో పాలసేకరణ కేంద్రాల వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ మంగళవారం కల్వకుర్తిలో నిర్వహించే పాడి రైతుల నిరసన కార్యక్రమానికి రైతులు పెద్దసంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు.