గద్వాల, జూలై 14 : జోగుళాంబ గద్వాల జిల్లాలో రోజురోజుకు సైబర్ కేసులు పెరిగిపోతుండడం వాటిని ఛేదించడం పోలీసులకు సవాలుగా మారుతున్నాయి. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఓ వైపు ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ప్రజలు, యువత సైబర్ మోసగాళ్లు ఉచ్చులోపడి రూ.వేలు, లక్షలు పోగొట్టుకుంటున్నారు. సైబర్ నేరగాళ్లు ఇచ్చే లింక్‌లతోపాటు వారి మాటలు నమ్మి సులభంగా డబ్బు సంపాదించా లనుకునే వారు వారి చేతుల్లో మోసపోతున్నారు.
సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఎంత అవగాహన కల్పించినా, జిల్లాలో ఏదో ఒక చోట రోజు సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోతూ వారి ఖాతాలను ఖాళీ చేసుకుంటున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు మోస పోయిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధించవచ్చని, మీ బ్యాంక్ ఖాతా స్తంభించిందని, డేటా ఆపరేటర్ పోస్టు ఇస్తాం కొంత చార్జీలు చెల్లించాలని, మీరు డీడీలు రూ.60వేలు చెల్లిస్తే మీకు రూ.ఐదు లక్షల చెక్‌తో పాటు పీఎం కిసాన్ ద్వారా ఫర్టిలైజర్ దుకాణం లైసెన్స్ ఇవ్వడంతో పాటు ఎరువుల సరఫరా చేస్తామని ఇలా డబ్బులు కట్టించుకుంటూ, త ర్వాత ఫోన్లు లిఫ్ట్ చే కుండా మోసాలు చేస్తున్నా రు.
వీటితోపాటు ఉద్యోగాలు ఇప్పిస్తామని, ఆన్లైన్ ట్రేడింగ్, టాస్క్ వర్క్ పేరుతో యువతను నమ్మించి భారీగా డ బ్బులు వసూలు చేసిన ఘటనలు జిల్లాలో వరుసగా వె లుగు చూస్తున్నాయి. ఇప్పటికే జనవరి నెలలో నాలుగు, జూన్‌లో ఒకటి నలుగురు బాధితులు ఇలా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి రూ.లక్షలు పోగొట్టుకున్నారు.
జనవరి 27అఫీషియల్ ట్రేడింగ్ ఎక్స్పర్ట్ అనే టెలిగ్రాఫ్ ఐడీ నుంచి ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ యువకుడిని మోసం చేశారు. రూ.50వేలు పంపిన తర్వాత మళ్లీ సర్వీస్ చార్జీలు, డాక్యుమెంట్ల పేరుతో మరో రూ.36 వేలు వసూలు చేశారు. తర్వాత వారి నుంచి లావాదేవీలకు సంబంధించి ఎటువంటి సమాధానం రాకపోవడంతో బాధితుడు జూలై 1న పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో యువకుడిని ప్రైవేట్ డ్రైవర్, సెక్యూరిటీ ఉద్యోగాలు, ఫైనాన్స్ సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి రూ.42,070 వరకు యూపీఐ ద్వారా వసూలు చేశారు.
ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు జూలై 1న గద్వాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫార్చ్యూన్ అలయన్స్ యాప్‌తో రూ.4.29 లక్షలు ఓ యువతి మోసపోయింది. ఓ యువతికి ఫార్చ్యూన్ అలయన్స్ వీ-10 యాప్ పేరుతో టెలిగ్రామ్ లింక్ ద్వారా లాభాల వల వేశారు. మొదట రూ.200 రిజిస్ట్రేషన్ ఫీజు, తర్వాత లాభాలు వస్తాయని నమ్మించి పలు యూపీఐ లావాదేవీలతో రూ.4,29,718 డిపాజిట్ చేయించుకొని మోసం చేశారు. బాధితురాలు జూన్ 20న పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరో యువకుడికి ఫేక్ ఈ-కామర్స్ లింకులు, చాట్ బాట్లతో టాస్క్ కంప్లీట్ చేస్తే లాభాలు వస్తాయని మోసగాళ్లు యువకుడిని నమ్మించారు.
మొదట రూ.1,300, ఆ తర్వాత రూ.350 అతని ఖాతాలో వేసి నమ్మించారు. అది నిజమని నమ్మి లాభం వస్తుందని ద శల వారీగా 11లావాదేవీల్లో రూ.2,64,000 సైబర్ నేరగాళ్ల ఖాతాలకు బదిలీ చేశారు. తర్వాత వారు స్పందించక పోవడంతో మోసపోయాయని భావించి బాధితుడు జూలై 2న పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇలా లాభాలు వస్తాయని కొందరూ, ఉద్యోగాల కోసం మరికొందరు, ఫర్టిలైజర్ దుకాణాలు ఏర్పాటు చేస్తే ఎరువు లు అందిస్తామని చెప్పడంతో వారి ఉచ్చులో పడి యువత మోసపోతున్నారు. ఇప్పటికైనా సెల్, వాట్సాప్‌లకు వచ్చే లింక్‌లపై అప్రమత్తంగా ఉండాలని బాధితులకు పోలీసులు సూచిస్తున్నారు.
ఈ ఏడాది జనవరి నెల 20వ తేదీన గద్వాల పట్టణంలోని వేదనగర్కు చెందిన ఓ యువతికి ఫేస్బుక్ ద్వారా ఓ కంపెనీలో డేటా ఆపరేటర్‌గా ఇంటి నుంచే పనులు చేయాల్సి ఉంటుందని చెప్పారు. దీనికి గాను అప్లికేషన్ ఫీజు కింద రూ.5100 చెల్లించాలని చెప్పడంతో నగదు బదిలీ చేసింది. రెండు రోజులు తర్వాత పోస్ట్ కావాలంటే మరింత నగదు చేయాలని కంపెనీ నిర్వాహకులు చెప్పడంతో ఇలా రూ.99,620 వ్యక్తి గత ఖాతాల్లోంచి నగదు కాజేశారు.
అదే నెలలో పట్టణానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి టెలీగ్రాప్ గ్రూప్ నుంచి ఓ కంపెనీలో నగదు జమచేస్తే అధిక లాభాలు వస్తాయని జనవరి 21న మెసేజ్ వచ్చింది. ఇది నిజమని నమ్మి పలు దఫాలు మొత్తం రూ.85వేలు డబ్బులు జమ చేశారు. ఎలాంటి లాభాలు రాకపోవడంతో తిరిగి తన డబ్బులు చెల్లించాలని కంపెనీ నిర్వాహకులను కోరగా వారి నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనవరి 24న గద్వాల పట్టణానికి చెందిన వ్యక్తికి ధని అనే ఫైనాన్స్ కంపెనీకి చెందిన వ్యక్తులు ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యారు.
వ్యక్తి గత రుణం తక్కువ వడ్డీకే అందజేస్తామని నమ్మించారు. ముందుగా సర్వీస్ చార్జీల పేరిట కొంత నగదు చెల్లించాలన్నారు. ఇది నిజమని నమ్మి పలు విడుతలుగా రూ.97వేలు చెల్లించారు. అయినా రుణం మంజూరు చేయలేదు. మరి కొంత డబ్బులు చెల్లిస్తే రుణం మంజూరు చేస్తామని చెప్పడంతో మోసపోయాయని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా జిల్లాలో సైబర్ కేసులు పెరిగిపోతూ పోలీసులకు సవాలుగా మారుతున్నాయి. ఇప్పటికైనా సైబర్ నేరగాళ్ల ప్రజలు, యువత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇలా మోసాలు చేసే వారి వివరాలు తమకు ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు.
సైబర్ మోసగాళ్లు టెలిగ్రామ్, వాట్సాప్, ఆన్లైన్ ప్రకటనకలు ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. ఇటు వంటి వాటికి ఆకర్షితులైన యువత, ప్రజలు సైబర్ మోసగాళ్లు చేప్పే మాటలు నమ్మి వారికి ఓటీపీలు తెలపడం, వచ్చిన లింక్‌లను క్లిక్ చేయడంతో తమ ఖాతాలు ఖాళీ చేసుకుంటున్నారు. మోసపోయినా తర్వాత చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. గత నెల 24న ఉండవెల్లి మండలానికి చెందిన వ్యక్తికి పీఎం కిసాన్ లింక్ ఇచ్చి దీనిలో మీ పేరు నమోదు చేసుకోవాలని చెప్పడంతో సైబర్ మోసగాళ్లు ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయడంతో అతని ఖాతాలోని రూ.28,495 నగదు సైబర్ మోసగాల్లు కొట్టేశారు.
డిజిటల్ పేమెంట్‌కు నకిలీ యాప్ సృష్టించిన కొందరు యువకులు మద్యం దుకాణాల్లో మద్యం కొనుగోలు చేసి మద్యం దుకాణ యజమానులను రూ. లక్షలు మోసం చేసిన ఘటన ఒకటి ఎర్రవల్లి మండలంలో చోటు చేసుకున్నది. ఎర్రవల్లి మండలంలోని ఒక మద్యం దుకాణంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన యువకులు డిజిటల్ పేమెంట్‌కు నకిలీ యాప్‌తో చెల్లింపులు చేస్తూ మద్యం కొనుగోలు చేశారు. మద్యం దుకాణదారులకు లెక్కల్లో తేడా రావడంతో అనుమానం వచ్చిన వారు డిజిటల్ పేమెంట్ చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నకిలీ యాప్‌తో పేమెంట్ చేసి మద్యం షాపు వారిని బురిడి కొట్టించినట్లు తెలిసింది.