కొల్లాపూర్ : పెద్దకొత్తపల్లి మండలం బాచారం గ్రామంలో మండల వ్యవసాయ అధికారి శిరీష ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్(NFNM) పథకంలో భాగంగా రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు మాట్లాడుతూ భూమి స్వభావాన్ని బట్టి పంటలను సాగు ( Crops cultivate) చేసుకోవాలని సూచించారు.
ఈ విధానం వల్ల అధిక దిగుబడి వచ్చేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ ప్రయోజనాలను రైతులకు వివరించారు. ఈ పథకంలో మట్టి నమూనాలు సేకరించే విధానాన్ని ప్రత్యక్షంగా రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు ముజీబ్, బాలస్వామి, రవికుమార్, అనిల్, మల్లేష్, మధుసూదన్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.