హన్వాడ, మార్చి 23 : హన్వాడ మండలంలో శనివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. ఈ వడగండ్ల వానతో చేతికొచ్చిన వరి పంట నేలమట్టమయ్యాయి. మండలంలోని కోనగట్టుపల్లి, హన్వా డ, సల్లోనిపల్లి, నాయినోనిపల్లి, యారోనిపల్లి గ్రామాల్లో దాదాపుగా 23 ఎకరాలల్లో వడ్లు రాలిపోయి పంటనష్టం కావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొనగట్టుపల్లిలో రమణారెడ్డి అనే రైతు ఐదు ఎకరాలల్లో వరి పంట సాగు చేశాడు. ఆదివారం మిషన్తో కోత కోసేందుకు సిద్ధమవ్వగా రాత్రి కురిసిన వడగండ్ల వానతో ధాన్యం మొత్తం నేలరాలడంతో రైతు లబోదిబో మంటున్నాడు. ప్రకృతి చేసిన బీభత్సంతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
చారకొండ, మార్చి 23: మండలంలోని చారకొండ, సి రుసనగండ్ల, మర్రిపల్లి, శాంతిగూడెం, జూపల్లి, తిమ్మాయిపల్లి, తుర్కలపల్లి తదితర గ్రామా ల్లో శనివారం రాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుతో వర్షం పడింది. దీం తో పలు గ్రామా ల్లో రైతులు సాగుచేసిన మొక్కజొన్న, వరి, జొన్న తదితర పంటలు నెలకొరిగాయి. దీంతో రైతులు దిక్కతోచని స్థితిలో ఉన్నారు. నష్టపోయిన పంటలకు పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.