కాంగ్రెస్ సర్కారు ప్రకటించిన రుణమాఫీ ఉమ్మడి జిల్లా రైతుల్లో గందరగోళాన్ని సృష్టించింది. రూ.లక్షలోపు రుణం ఉన్నవారందరికీ మాఫీ చేస్తామని చెప్పి తీరా కొంతమంది పేర్లతోనే జాబితా ఇవ్వడంతో మిగతా రైతులు నిప్పులు కక్కుతున్నారు. రుణమాఫీ విడుదల చేశామంటూ ఓ వైపు అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సంబురాలు చేసుకుంటుండగా, మరోవైపు తీసుకున్న రుణం మాఫీ కాలేదని కర్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అరకొరగా మాఫీ చేసిన కొందరు రైతుల్లో కూడా సగం రుణం మాత్రమే మాఫీ కావడంతో వివరాల కోసం బ్యాంకులకు పరుగులు పెడుతున్నారు. మిగతా వారు అధికారులు ప్రకటించిన జాబితాలో తమ పేర్ల కోసం బూతద్దం పెట్టి మరీ వెతుక్కునే పరిస్థితి నెలకొన్నది.
– నెట్వర్క్ మహబూబ్నగర్, జూలై 19
కేసీఆర్ ప్రభుత్వంలో రూ.38 వేలు రుణమాఫీ అయ్యింది. కాంగ్రెస్ ప్ర భుత్వం రూ.లక్షలోపు వారందరికీ మొదటి విడుతలో రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పడంతో వడ్డీ కట్టలేదు. రెన్యువల్ కూడా చేసుకోలేదు. కానీ ప్ర భుత్వం ప్రకటించిన రుణమాఫీ జాబితాలో నా పేరు లేకపోవడంతో బ్యాం కుకు వెళ్తే రూ.70 వేలు బాకీ ఉందని కట్టమంటున్నారు. ప్రభుత్వం కొర్రీలు పెట్టకుండా రుణాన్ని మాఫీ చేయాలి.
– సజ్జల నర్సింహులు, రైతు, కేశవ్పూర్ గ్రామం
కాంగ్రెస్ ప్రభుత్వం రూ.లక్షలోపు రుణాలు మాఫీ చేస్తామని చెప్పింది. నేను రూ.50 వేలు లోన్ తీసుకున్నా. అందుకు వడ్డీ 4వేలు అయ్యింది. వడ్డీ కడితే గాని రుణ మాఫీ కాదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ ప్రకటనకు, అ ధికారుల తీరుకు చాలా తేడా ఉంది. ప్రతి రై తుకు రూ.రెండు లక్షలలోపు రుణమాఫీ అని ప్రభుత్వం ప్రకటించి ఇప్పుడు వడ్డీ కట్టాలని చె ప్పడం వింతగా ఉంది. కొందరికి మాఫీ చేసి మరికొందరికి చేయకపోవడం సరికాదు. ప్ర భుత్వం అర్హులందరికీ రుణాలు మాఫీ చేయాలి
-పరశురాముడు, రైతు, శెట్టిఆత్మకూరు, గద్వాల మండలం
కేసీఆర్ ప్రభుత్వం రైతులకు ఇదివరకే రైతుబంధు ఇచ్చేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుబంధుపై ఇంకా తేల్చకుండా సమావేశాల పేరుతో కాలం గడుపుతున్నది. వాటికి సంబంధించిన డబ్బులను ప్రభుత్వం రుణమాఫీ పథకానికి మళ్లించింది. అంతే కాకుండా ఎన్నికల ముందు రైతులందరికీ రూ.2 లక్షలలోపు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు రూ.లక్షలోపు వారికే చేసింది. అందులోనూ అనేక కొర్రిలు పెట్టి అర్హులకు రుణమాఫీ అందించడం లేదు.
– తూర్పు యాదిరెడ్డి, గార్లపాడు, కోయిలకొండ మండలం, మహబూబ్నగర్ జిల్లా
కాంగ్రెస్ ప్రభుత్వం రై తులకు ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికల స మయంలో చెప్పి ఓ ట్లు వేయించుకున్న ది. అధికారంలోకి వ చ్చిన ఎనిమిది నెలల తర్వాత మొకుబడి గా రైతులకు రుణమా ఫీ చేస్తామని చెప్పింది. నాకు రూ.2లక్షల రుణం ఉండగా కేవలం రూ.90 వే లు మాత్రమే మాఫీ అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ చె ప్పిన దానికి, చేసిన దానికి పొంతన లేదు. ఇది పూర్తిగా రైతులను మోసం చేయడమే.
-నర్సింహ, రైతు, దాసరిదొడ్డి, మక్తల్ మండలం, నారాయణపేట జిల్లా
ఏపీజీవీబీలో రూ.75 వేల క్రాప్ లోన్ తీసుకోగా ప్రభుత్వం ప్రకటించిన లక్షలోపు రుణాలు మంజూరు అవుతున్న నేపథ్యంలో రూ.75 ఉన్నా నాకు ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. ప్రభుత్వం అందరికీ ఇచ్చినట్లు చెప్పుకుంటున్నది కానీ నాలాంటి చాలా మంది రైతులకు రుణమాఫీని అమలు చేయడం లేదు. ప్రభుత్వం అర్హులైన ప్రతిరైతుకు రుణమాఫీ పథకాన్ని వర్తింప జేయాలి.
– రామిని సునీత, రైతు, పంచలింగాల, మక్తల్ మండలం, నారాయణపేట జిల్లా
ప్రభుత్వం మొదటగా రూ.లక్షలోపు అప్పున్న రై తులకు రుణమాఫీ చేసినట్లు చెబుతుంది. నేను రూ.90 వేల అప్పు తీ సుకున్నాను. ప్రభు త్వం ఇచ్చిన జాబితాలో నా పేరు లేదు. కేసీఆర్ సారు హ యాంలో రుణమాఫీ అయ్యింది. ఇప్పుడు ఎందుకు రాలేదో.. ఎవరిని అడగాలో తెలియడం లే దు. బ్యాంకుకు వెళ్తే ఎవరూ సమాధానం చెప్తలేరు.
– మంగళిపెద్ద ఆంజనేయులు, రైతు, ధన్వాడ, నారాయణపేట జిల్లా