మాగనూరు/కృష్ణ, ఏప్రిల్ 17 : అర్ధరాత్రి రోడ్డుపై మొసలి కలకలం రేపిన ఘటన కృష్ణ మండలం హిందూపూర్ గ్రామ శివారులో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. హిందూపూర్ గ్రామ శివారులో బుధవారం అర్ధరాత్రి రోడ్డుపై మొసలి వెళ్తుండగా స్థానికులు గమనించారు. కాగా, అప్పటికే మొసలి పైనుంచి గుర్తుతెలియని వాహనం వెళ్లడంతో గాయాలయ్యాయి. గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్సై సురేందర్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని మొసలిని చెట్టుకొమ్మకు కట్టేసి ఫారెస్ట్ అధికారులకు సమాచారమిచ్చారు.
దీంతో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గురువారం ఉదయం 10గంటలకు వచ్చి మొసలిని కృష్ణానదిలో వదిలారు. ఈ సందర్భంగా సెక్షన్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు మా ట్లాడుతూ కృష్ణానది సమీపంలో ఉండడం, చెరువుల వద్ద రో డ్డు పక్కన మాంసం వ్యర్థాలను పడవేయడం వల్ల వాటి కో సం మొసళ్లు, ఇతర అడవి జంతువు లు జనసంచారంలోకి వస్తున్నట్లు తెలిపా రు. మాంసం వ్యర్థాలను చెరువుల్లో పారవేయొద్దని సూచించారు.