మహబూబ్‌నగర్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రా హుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తీవ్ర విమర్శల పాలువుతున్నది. ఉదయం 6 గంటలకే యాత్ర ప్రారంభించడం.. రాహుల్‌ను కలిసేందుకు వచ్చే జనా లు, పార్టీ నాయకులను ఆయన వ్యక్తిగత సిబ్బంది తోసేయడంపై అసంతృప్తి వ్యక్తమవుతున్నది. రాహుల్ ముం దే ఎందరో కిందపడి గాయాలపాలవుతున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కొందరిని ఆయ న దగ్గరకు పిలిచి చేయి కలిపి వెంటనే అక్కడి నుంచి పంపించివేస్తున్నారు. ఈ క్రమంలో రాహుల్ వెంట ఉండే ప్రైవేటు సైన్యం నిర్ధాక్షిణ్యంగా తోసేస్తున్నారు. దీం తో చాలా కింద పడిన ఘటనలు ఉన్నాయి. ఈ యాత్ర సాగుతున్నంత సేపు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉంటాయి. అయితే రహదారిపై నడుస్తున్న క్రమంలో అడ్డొచ్చిన వారందరినీ తోసుకుంటూ పోతున్నారు. దీంతో ఇదేం యాత్ర అని జనం అసహనం వ్యక్తం చేస్తున్నారు.
వేలకు వేలు ఖర్చు చేసి స్వాగతం పలుకుతున్నా..
మహబూబ్‌నగర్‌లో శనివారం రాహుల్ జోడో యా త్ర రసాభాసగా సాగింది. యువనేత కంట పడాలని చా లా మంది వేలకు వేలు రూపాయలు ఖర్చు చేసి యాత్ర కు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. అ యితే వారిని కనీసం పలకరించకుండా రాహుల్ ముం దుకెళ్లారు. జిల్లా కేంద్రంలోని వన్‌టౌన్, అంబేద్కర్, న్యూటౌన్, మెట్టుగడ్డ చౌరస్తాల్లో జనాన్ని, నాయకుల ను రాహుల్ సెక్యూరిటీ, పోలీసులు తోసేస్తున్నారు. మ హిళలు అని చూడకుండా పక్కకు నెట్టేయడంతో నేతలు ఖంగుతిన్నారు. బండమీదిపల్లి వద్ద పాలమూరు యునివర్శిటీ సమీపంలో, మరికొన్ని చోట్ల డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ బంజారా వేషధారణలో మహిళల ను నిలబెట్టి వారి వద్దకు రావాలని పోలీసుల వలయంలోకి వచ్చి కోరినా పక్కకు పంపించేశారు. న్యూటౌన్ చౌరస్తాలో పీసీసీ అధికార ప్రతినిధి సంజీవ్ ముదిరాజ్ బంతిపూలతో స్వాగతం పలకడానికి యత్నించగా.. తోసేయడంతో పూలన్నీ నేలపాలయ్యాయి. ఆటో యూ నియన్ నాయకులు రాహుల్‌ను కలవడానికి ప్రయత్నించగా వారిని కూడా దగ్గరకు రానివ్వలేదు. ఇదిలా ఉంటే ఉత్తమ పార్లమెంటేరియన్, జిల్లాకు చెందిన ది వంగత కాంగ్రెస్ నేత ఎస్.జైపాల్‌రెడ్డి కాలేజీలో బస చే సిన రాహుల్ కనీసం ఆయన విగ్రహం వద్ద కూడా ని వాళులర్పించకపోవడంపై కాంగ్రెస్ నేతలే విమర్శలు చే స్తున్నారు. జనాలను కలువకుండా.. వారి బాగోగులు తెలుసుకోని యాత్రలు ఎందుకని ప్రజలు ప్రశ్నిస్తున్నా రు. పీయూ విద్యార్థులు కలవడానికి చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. కేవలం బడా నేతలు తమ తమ జిల్లాల నుంచి తీసుకొచ్చిన మంది మార్భాలాన్ని మాత్రమే రాహుల్ కలుస్తున్నారనే గుసగుసలు వినిపించాయి.
యాత్రలో నాయకుల మధ్య పోటాపోటీ..
జడ్చర్ల/టౌన్, అక్టోబర్ 29 : భారత్ జోడో యా త్రలో కాంగ్రెస్ నాయకులు పోటీపడి బ్యానర్లను ఏర్పా టు చేశారు. సమావేశం వేదికపై మాజీ ఎంపీ మల్లురవి హల్చల్ కనిపించింది. నియోజకవర్గ స్థాయి నాయకులని చెప్పుకొంటున్న వారిని స్టేజీపైకి పిలవలేదు. మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ గైర్హాజరు కావడం చర్చనీయాంశం గా మారింది. కాగా, యాత్ర సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో ప్రజలు ఇక్కట్లకు గురయ్యారు. ఓ వైపు యాత్ర కొనసాగుతుండగా.. కాంగ్రెస్ కార్యకర్తలు వైన్స్ షాపుల్లో మందు కొడుతూ జోష్‌మీద కనిపించారు. ఇది చూసి జోడోయాత్ర కాదు.. మందుబాబుల జోష్ యాత్ర అంటూ చర్చించుకున్నారు.