మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మార్చి 4 : దేశంలో మోదీ ప్రభుత్వ విధానాలతో ప్రజాస్వామ్యం పెనుప్రమాదంలో పడిందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యు డు చాడ వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివా రం జిల్లా కేంద్రంలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. దేశానికి స్వాతం త్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచినా సంపద కొద్దిమంది చే తుల్లోనే ఉన్నదని వాపోయారు. బీజేపీ ప్రభుత్వంలో ప్రజాస్వామ్య విలువలు పాతరేయబడ్డాయని విమర్శించారు. అణిచివేత ధోరణి పెరిగిపోయిందని ఆవేదన చెందారు. దేశంలో ఎవరికీ స్వేచ్ఛ లేకుండా.. ప్రాథమి క హక్కులకు భరోసా లేకుండా పోయిందన్నారు.
ఫెడరల్ వ్యవస్థలో అన్ని రాష్ర్టాలను సమానంగా చూడాల్సి న బాధ్యత కేంద్రంపై ఉన్నదన్నారు. అయితే ప్రతిపక్ష పార్టీల పాలనలో ఉన్న రాష్ర్టాలపై శీతకన్ను చూపిస్తూ పక్షపాత ధోరణి అవలంబిస్తున్నదని ఆరోపించారు. గవర్నర్ల వ్యవస్థను తమ స్వార్థ ప్రయోజనాల కోసం వా డుతూ ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను పడగొట్టే దుర్మార్గపు ఆచారానికి తెరలేపారని దుయ్యబట్టారు. ప్రభుత్వ బిల్లులను ఆమోదించకుండా పెండింగ్లో ఉంచడం గవర్నర్ వ్యవస్థకు కలంకమని పేర్కొన్నారు. ప్రతి విషయంలో కోర్టులు జోక్యం చేసుకునే వరకు వెల్లడం సరికాదన్నారు. అధికారం ఉందని గవర్నర్లు ఇష్టారీతిగా వ్యవహరించడం తగదన్నారు.
ప్రతిపక్ష పాలిత ప్రభుత్వాలపై ఈడీ, ఐటీ దాడులు చేయించడం, ప్రతిపక్షాల గొంతు నొక్కడమేనన్నారు. పేదలపై ధరాభారం మోపు తూ, కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అదానీ, అంబానీలు దివాలా తీస్తే బ్యాంక్లు దివాలా తీస్తాయని.. అప్పుడు కేంద్రం దివాలా తీసిన సంస్థల రూ.వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తుందన్నారు. పెట్రోల్, డీజిల్, సిలిండర్ల ధరలు అమాంతం పెంచి పెనుభారం మోపిందని విమర్శించారు. బీజేపీ నుంచి రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి మిగతా పక్షాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీకి తామే మద్దతు ప్రకటించినట్లు తెలిపారు. దీంతో రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ కొన్ని సీట్లు గెలవచ్చన్నారు. అయితే తమ పార్టీకి సీట్ల కంటే ప్రజా సంక్షేమమే ముఖ్యమన్నారు. ఏప్రిల్ 14 నుంచి మే 15 వరకు సీపీఐ జాతీయ సమి తి పిలుపు మేరకు మతోన్మాద, నియంతృత్వ పార్టీ నుంచి దేశాన్ని రక్షించాలనే లక్ష్యంతో పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బృంగి బాలకిషన్, జిల్లా కార్యవర్గ సభ్యుడు సురేశ్, కృష్ణ యాదవ్, పరమేశ్గౌడ్, రాము, నరసిం హ, గోవర్దన్, విల్సన్, సంతోశ్ తదితరులున్నారు.