తిమ్మాజిపేట, నవంబర్ 14 : మండలంలోని గొరిట పీఏసీసీఎస్లో గురువారం విచారణ కోసం వచ్చిన సహకార సంఘం అధికారులకు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసిస్టెంట్ రిజిస్ట్రార్ అంజమ్మ, సహకార శాఖ సీనియర్ ఇన్స్పెక్టర్ పురుషోత్తంరావు, మరో అధికారి నగేశ్ విచారణ ని ర్వహించారు. సొసైటీలో స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు తీసుకున్న ఆరుగురు రైతులను పిలిపించి వివరాలను నమోదు చేశారు.
రైతు లు ఉమాకాంత్(బుద్దసముద్రం), ద్వాప సు గణమ్మ (మరికల్), అనిల్ (ఆవంచ), దాసర్ల నారమ్మ (కోడుపర్తి)తోపాటు మరో కొందరి వివరాలను సేకరించారు. వారంతా 2021-22లో రుణాలు చెల్లించారని, అయితే సొసైటీలో మాత్రం గత నెల (అక్టోబర్-2024) చెల్లించినట్లు ఉందని తెలిపారు. గత నెల 18, 19, 22వ తేదీలలో రూ.3.95 కోట్లు చెల్లించారని అధికారి పురుషోత్తం తెలిపారు. రోజువారీ రికార్డులు నమోదు కూడా సరిగ్గా లేదన్నారు. అయితే రైతులు విండోలో జరుగుతున్న వ్యవహారాలపై తీవ్ర ఆరోపణలు చే శారు. రైతుల వివరాలను డీసీవోకు అందిస్తామని పురుషోత్తం తెలిపారు. సొసైటీలో రు ణాలు తీసుకున్న మిగిలిన రైతుల వివరాలను తీసుకునే అవకాశం ఉన్నదన్నారు. విచారణంలో స్థానిక విండో సిబ్బంది పాల్గొన్నారు.