పాలమూరు, ఫిబ్రవరి 25 : పాలమూరు విశ్వవిద్యాలయం లో ఇంటిగ్రెటెడ్ కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 27, 28న జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సదస్సును నిర్వహించనున్నట్లు సదస్సు కన్వీనర్ డాక్టర్ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం పీయూలో పీజీ కళాశాలలో మీడియా సమావేశం ఏ ర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైన్స్ సదస్సుకు కీ నోట్ స్పీకర్‌గా ఐఐటీసీ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, వీసీ లక్ష్మీకాంత్‌రాథోడ్ ముఖ్యఅతిథులుగా హాజరవుతున్నట్లు పేర్కొన్నారు.
సదస్సులో కెమిస్ట్రీ ఫర్ సస్టెయినబుల్ ఫ్యూచర్ అనే అంశంపై ప్రసంగించాడానికి ఐఐటీఎస్ఈఆర్ కేరళ, ఐఐటీఎస్సీ కర్ణాటక, వీఎస్‌ఎస్‌యూటీ ఒడిశా, ఐఐసీటీ హైదరాబాద్‌కు చెంది న శాస్త్రవేత్తలు హాజరుకానున్నారు. అదేవిధంగా దేశం నలుమూలల నుంచి విద్యావేత్తలు, ఇండస్ట్రియల్ పర్సన్స్, స్కాలర్స్, విద్యార్థులు హాజరుకానున్నారని వెల్లడించారు. కార్యక్రమంలో కోకన్వీనర్లు రామ్మోహన్, డాక్టర్ రవికుమార్, సిద్ధరామగౌడ్, పండుగ రామరాజు, జ్ఞానేశ్వర్, సత్యం, రాఘవేందర్, శంకర్ పాల్గొన్నారు