అచ్చంపేట/లింగాల, మార్చి 12: దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగంలో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న ఏడుగురి కోసం రెస్క్యూ ఆపరేషన్లోకి రోబోలు ఎంట్రీ ఇచ్చారు. టన్నెల్లో చిక్కుకున్న వారి జాడ కోసం నాలు గు షిప్టులుగా 12 కేంద్ర, రాష్ట్ర సహాయక సంస్థల బృందా లు 24గంటలపాటు పూర్తిస్థాయిలో సహాయక చర్యలు చేపడుతున్నాయి.
మానవ సహాయక బృందాలకు అవసరమైన సామగ్రి, నీరు, మెడికల్ సపోర్ట్, ఆక్సిజన్ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నారు. బుధవారం డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్‌కుమార్, నాగర్‌కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆఫీసులో సహాయక చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. టన్నెల్లో సహాయక చర్యలు వేగవంతం చేసేందుకు అన్వీ రోబోటిక్స్ సంస్థకు చెందిన అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోను ప్రమాద ప్రదేశానికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
టన్నెల్లో సహాయక చర్యలు వేగవంతం చేసేందుకు అన్వీ రోబోటిక్స్ సంస్థకు చెందిన అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోను లోకో ట్రైన్ ద్వారా లోపలికి పం పించారు. ఉదయం 110మంది రెస్క్యూ సహాయక సిబ్బంది మొదటిషిప్టులో లోపలికి వెళ్లారు. క్యాడవర్ డాగ్స్, జీపీఆర్ ర్యాడర్ గు ర్తించిన డీ1, డీ2 ప్రదేశాల్లో ర్యాట్ మైనర్స్, సింగరేణి రెస్క్యూ బృందం మృతదేహాల కోసం తవ్వకాలు జరుపుతున్నారు. అయితే టన్నెల్ పైకప్పు నుంచి నీళ్లు జాలువారుతున్నాయి.
అన్వీ రోబోటిక్ సంస్థకు చెందిన అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోను ప్రమాద ప్రదేశానికి తీసుకెళ్లారు. రోబో ద్వారా టన్నెల్ లోపల ఉన్న శిథిలాలను తొలగించడం, భూమిని తవ్వడం వం టి సహాయక చర్యలు చేపడతాయి. టన్నెల్ లోపల టీబీ ఎం ముందుభాగంలో 50మీటర్లు అత్యంత ప్రమాదకరంగా మారింది. అక్కడికి వెళ్లేందుకు రెస్క్యూ బృందాలకు అవకాశం లేకపోవడంతో రోబోలను రంగంలోకి దిం పారు. రోబో అక్కడ శిథిలాలు తొలగించడం, భూమి ని తవ్వడం, మట్టిని తీసి కన్వేయర్ బెల్టుపై వేయ డం లాం టి చర్యలు చేపట్టనున్నది.
ఈరోజు రాత్రికి మరోరెం డు రోబోలు టన్నెల్‌కు చేరుకోనున్నాయి. అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబో ద్వారా 40హెచ్‌పీ పంపు సహాయంతో బురదను బయటకు పంపనున్నారు. టన్నె ల్ లోపల రోబో అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోతో విజయ్, అక్షయ్ తమ బృందంతో టన్నెల్ లోపలికి లోకో ట్రైన్ ద్వారా వెళ్లారు. లోపల రోబో పనిచేసే విధానం, బయట నుంచి ఆపరేటర్ చేసేందుకు కమ్యూనికేషన్ వ్యవస్థను అమర్చారు. ఆల్ ఇండియా రోబోటిక్ అసోసియేషన్ చైర్మన్ కిషన్ టన్నెల్ వద్దకు చేరుకొని రోబోలకు సంబంధించిన సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదంలో చిక్కుకొని ఈనెల 9న బయట పడిన మృతదేహాన్ని అధికారులు నాగర్‌కర్నూల్ దవాఖానలో పోస్టుమార్టం అనంతరం సొంత రాష్ట్రమైన పంజాబ్‌కు తరలించారు. బుధవారం ఉద యం 10గంటల ప్రాంతంలో గురుప్రీత్‌సింగ్ స్వగ్రామానికి చేరుకొని కుటుంబ సభ్యులకు మృతదేహం అప్పగించారు. అదేవిధంగా భార్య రజ్వీందర్కౌర్కు రూ.25 లక్షల చెక్కును అందజేశారు.