కొల్లాపూర్ : మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్( Kollapur ) పట్టణంలో ఆదివారం ప్రమాదవశాత్తు కూలి మరణించాడు. మత్స్యకార కుటుంబానికి చెందిన జలకం నరసింహ (46 ) గృహ నిర్మాణంలో కూలి పనికి వెళ్లి మధ్యాహ్నం పై అంతస్తుకు రాళ్లు మోస్తుండగా ఒక్కసారిగా కాలుజారీ మెట్ల మీద నుంచి కింద పడి తలకు తీవ్రంగా గాయాలయ్యాయి.
దీంతో అతడిని తోటి కూలీలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యలో చనిపోయాడు. మృతుడికి భార్య లక్ష్మి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. బాధిత కుటుంబాన్ని తెలంగాణ సంప్రదాయ మత్స్యకారుల సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జలక మద్దిలేటి పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు.