నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఏర్పడిన పార్టీ సమైక్య పాలకులు, వ్యాపారులకు ఎదురొడ్డి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించింది. దీంతో వరుసగా సాధారణ, స్థానిక ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కు పట్టం కడుతూ వస్తున్నారు. ఈక్రమంలో జాతీయ పార్టీగా రూపాంతరం చెందిన బీఆర్ఎస్ దేశ రాజకీయాల్లోనూ ప్రభంజనంలా ఎదుగుతోంది. ప్రభుత్వం చేసిన అభివృద్ధిని నాయకులు, కార్యకర్తలకు వివరించేందుకు ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనాలు సైతం విజయవంతంగా కొనసాగుతున్నాయి.
నెల రోజులుగా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో మండలాలు, గ్రామాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తుండగా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు, జెడ్పీ చైర్మన్లతోపాటు సర్పంచ్‌స్థాయి వరకు ప్రజాప్రతినిధులు, పార్టీల మండల, గ్రామస్థాయి నాయకత్వమంతా సమ్మేళనాల్లో పాల్గొంటున్నారు. దాదాపుగా ఆత్మీయ సమ్మేళనాలు ముగియడంతో 25న నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల నాయకత్వంలో నియోజకవర్గస్థాయి ఆత్మీయ సమ్మేళనాలు జరుగనున్నాయి. 27వ తేదీన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. కాగా మంగళవారం ఉదయమే గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా జెండా పండుగను చేయనున్నారు. ఆయా వార్డుల్లో కౌన్సిలర్లు, సర్పంచులు జెండాలు ఎగురవేస్తారు.
అనంతరం నియోజకవర్గకేంద్రాలకు ఆయా మండలాల ముఖ్య నాయకత్వం తరలివెళ్లి సుమారు 3వేలమందితో ప్రతి నియోజకవర్గస్థాయి ఆత్మీయ సమ్మేళనం జరుగనుంది. ఇప్పటివరకు జరిగిన మండలస్థాయి ఆత్మీయ సమ్మేళనాల్లోనూ 3వేల మంది హాజరవడం గమనార్హం. ఈ సమ్మేళనాలు ఎమ్మెల్యేలతోపాటటు పార్టీలో ఉత్సాహాన్ని నింపాయి. పార్టీ పిలుపుతో వేలాది మంది సొంతంగా బైకులు, కార్లల్లో తరలొచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు సమ్మేళనాల్లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సందడి చేశారు. ఎమ్మెల్యేలు తమ కుటుంబసభ్యులతో కలిసి పార్టీ శ్రేణులతో చిందులేశారు. మంత్రులు, పార్టీ జిల్లాల ఇన్చార్జిలు కూడా పాల్గొని శ్రేణులను ఉత్తేజపర్చారు. బతుకమ్మ, తెలంగాణ ఉద్యమ పాటలతో సమ్మేళనాలు బీఆర్ఎస్లో ఉత్సాహాన్ని నింపగా.. ప్రతిపక్షాల్లో గులుబు రేకెత్తించింది. ఈక్రమంలో మరోసారి నియోజకవర్గస్థాయి సమ్మేళనాల నిర్వహణ ప్రత్యేకతను సంతరించుకోనున్నది.
25న నియోజకవర్గస్థాయిలో..
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా 25న నియోజకవర్గస్థాయి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తు న్నాం. గ్రామాలు, మున్సిపాలిటీ ల్లో బీఆర్ఎస్ జెండాలను ఎగురవేసిన అనంతరం నియోజకవర్గకేంద్రాలకు పార్టీ నాయకులు, కా ర్యకర్తలు తరలొస్తారు. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్పై నాయకులు, ప్ర జల్లో విశ్వాసం ఏమాత్రం తగ్గలేదు. దీనికి మండల ఆత్మీయ సమ్మేళనాలే నిదర్శనం. సమ్మేళనాలతో ప్రతిపక్షాలకు నిద్రపట్టడం లేదు.
– బైకని శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి
అట్టహాసంగా జెండా పండుగ
ఈనెల 25న గ్రామాలు, పట్టణాల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవే స్తాం. అనంతరం నియోజకవర్గ ఆ త్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తు న్నాం. ప్రజలంతా బీఆర్ఎస్ను తమ కుటుంబంలాగా పరిగణనిస్తున్నారు. ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణను సాధించినట్లుగానే.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో జా తీయ రాజకీయాల్లోనూ బీఆర్ఎస్ ప్రభావం చూపిస్తుంది. ప్రజలంతా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనాలి.
– గువ్వల బాలరాజు, ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే
సమ్మేళనాలకు అనూహ్య స్పందన
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. సీఎం కేసీఆర్ పిలుపుతో ఊరూరా ప్రజలు స్వచ్ఛందంగా.. వేలాదిగా తరలిరావడంతో సమ్మేళనాలు ఇంటి పండుగలా జరిగాయి. బీఆర్ఎస్ పార్టీపై తమ విధేయతను సమ్మేళనాలు ప్రతిపక్షాలకు చూపించాయి. తమకు ఈ ప్రభుత్వం వల్లే మేలు జరుగుతుందనే నమ్మకం ప్రజల్లో స్థిరపడిపోయింది. బీఆర్ఎస్ ఆవిర్భావ సభ దేశ రాజకీయాలకు మార్గనిర్దేశాన్ని సూచిస్తుంది.
– మర్రి జనార్దన్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే