మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఆగస్టు 27 : పో లీసు కానిస్టేబుల్ పోస్టుల కోసం ఆదివారం రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లా ఎస్పీ లు, పోలీసు అధికారులు పరీక్ష పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లాలో 63,358 మంది రాత పరీక్షకు హాజరుకానున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో 24,798, నాగర్కర్నూల్లో 12,528, వనపర్తి లో 9,706, జోగుళాంబ గద్వాలలో 11,420, నారాయణపేటలో 4,906 మంది అభ్యర్థులు ప రీక్ష రాయనున్నారు. ఇందుకోసం దాదాపు 240 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీ క్ష జరగనున్నది. ఎలాంటి అవకతవకలకు ఆవకాశం లేకుండా పరీక్ష నిర్వహించే గదుల్లో కోడిం గ్ పద్ధతిన అభ్యర్థులకు కుర్చీలు, గట్టి పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 15,640 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడగా, ఉమ్మడి జిల్లాకు 818 పోస్టులను అలాట్ చేశారు. రాత పరీక్షలో అర్హత సాధించిన ఆభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు.
గంట ముందే చేరుకోవాలి..
రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గంటముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. థర్మల్ స్క్రీనింగ్తోపాటు బయోమెట్రిక్ విధానం ఉం టుంది. సెల్ఫోన్, ఎలక్ట్రానిక్ వస్తువులు, గోరింటాకు వంటి వాటికి అనుమతి ఉండదు. బాల్ పాయింట్ పెన్ ద్వారా మాత్రమే జవాబు పత్రంలోని బబుల్స్ నింపాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. శనివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎ స్పీ కార్యాలయంలో ఏఎస్పీ రాములు, డీఎస్పీ
మహేశ్ సిబ్బందితో సమావేశమయ్యారు. జిల్లాలోని 64 కేం ద్రాలను రూట్లుగా విభజించి 600 మంది పోలీసులను బందోబస్తు కోసం కే టాయించారు. ఒక్కో రూట్లో ఒక సీఐ ఆధ్వర్యంలోని టీం పర్యవేక్షణ చేయనున్నది. అవస రం ఉన్న వస్తువులు మాత్రమే వెంట తెచ్చుకోవాలని, ఉన్నతాధికారులు, పోలీసు అ ధికారుల నిఘాలో కేంద్రాలు ఉంటాయని, పరీక్ష జరిగే సమయంలో జీరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ కేంద్రాలు మూసివే యాలని మహబూబ్నగర్ ఎస్పీ వెంకటేశ్వర్లు సూ చించారు.