ఆత్మకూర్ : మండల పరిధిలోని మూలమల్ల గ్రామ మాజీ ఉపసర్పంచ్ వినయ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులను శుక్రవారం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పరమేష్, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు రహమత్తోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు ( Congress Leaders ) పరామర్శించారు. మాజీ ఉపసర్పంచ్ వినయ్ కుమార్ రెడ్డి మాతృమూర్తి ఊలిపాల సావిత్రమ్మ అనారోగ్యంతో గురువారం మృతి చెందింది.
శుక్రవారం కాంగ్రెస్ నాయకులు వినయ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు పరామర్శించి ఆమె మృతదేహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో నాయకులు మనివర్ధన్ రెడ్డి, ఆత్మకూరు మాజీ సర్పంచ్ గంగాధర్ గౌడ్, ఆత్మకూర్ మాజీ వైస్ ఎంపీపీ వెంకట నర్సింగ్, ఆత్మకూరు పట్టణ అధ్యక్షుడు నల్లగొండ శ్రీనివాసులు, యువజన కాంగ్రెస్ నాయకుడు తులసి రాజు యాదవ్, నాయకులు పాల్గొన్నారు.