వనపర్తి టౌన్, ఏప్రిల్ 21 : వనపర్తి మండలం రాజనగరం గ్రామ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు వంశీ సోమవారం జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి స్వగృహంలో బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వంశీకి మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగెస్ పార్టీ మనుగడ ఎక్కువ రోజులు కొనసాగదని , రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.
బీఆర్ఎస్తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలు గుర్తించారని రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం పార్టీలో చేరిన వంశీ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అందుకోసమే బీఆర్ఎస్లో చేరినట్లు చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలపర్చిన అభ్యర్థుల గెలుపుకోసం తనవంతు కృషి చేస్తానన్నారు.
కార్యక్రమంలో వనపర్తి పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, గొర్రెల కాపరుల మాజీ జిల్లా అధ్యక్షుడు పందెం కురుమూర్తియాదవ్, మార్క్‌ఫెడ్ డైరెక్టర్ విజయ్‌కుమార్, మీడియా కన్వీనర్ నందిమల్ల ఆశోక్, పార్టీ అధ్యక్షుడు అంజయ్య, సింగిల్‌విండో వైస్ చైర్మన్ బాలచంద్రయ్యయాదవ్, యూత్ అధ్యక్షులు కరుణాకర్, కుమ్మరి సత్తయ్య, బండి చంద్రయ్య, బుచ్చిబాబు, బాలస్వామి, వెంకటేశ్, రమేశ్ పాల్గొన్నారు.