మరికల్, జూన్ 20 : నిరుపేదలకు సొంత ఇంటి కల నిజం చేస్తూ వారి కళ్ళల్లో ఆనందం చూస్తున్నామని నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి అన్నారు. శుక్రవారం మరికల్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, నిరుపేదలందరికీ విడుదల వారీగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి ఐదు లక్షల రూపాయలను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్లు లేని నిరుపేదలను గుర్తించి వారికి ఇందిరా మైండ్ లను కేటాయించడం జరుగుతుందన్నారు. ప్రజా సంక్షేమంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు సూర్య మోహన్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వీరన్న, పట్టణ అధ్యక్షుడు హరీష్ కుమార్, నాయకులు కృష్ణయ్య, మాజీ ఎంపిటిసి గోపాల్, లంబడి రాములు, సత్యనారాయణ రెడ్డి, గుప చెన్నయ్య, రఘు, రఘుపతి రెడ్డి, రాజు, కురుమన్న, విజయ్,ఎంపీడీవో కొండన్న, హౌసింగ్ డిఈ హరికృష్ణ, పంచాయతీ కార్యదర్శి శ్యాంసుందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.