మహబూబ్‌నగర్, డిసెంబర్ 28 : మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో మొదటి రోజు ఆయా గ్రామాల్లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తుల కొరత వేధిస్తున్నది. అధికారులు ఇంటికో దరఖాస్తు మాత్రమే పంపిణీ చేయగా.. ఇంట్లో రెండు, మూడు కుటుంబాలు ఉండడంతో ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. అవసరమైన వారు జిరాక్స్ చేయించుకొని దరఖాస్తులు ఇవ్వాలని అధికారులు సూచించినా.. గ్రామీణ ప్రాంతాల్లో జిరాక్స్ తీసుకొనే వీలులేక పట్టణ ప్రాంతాలకు వెళ్లి జిరాక్స్ తీసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది.
జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో ప్రజాపాలన నిమిత్తం బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యేలు ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాలని పలు ప్రశ్నలు సంధించినప్పటికీ కేవలం నోటి మాట వరకు మాత్రమే ఆగిపోయాయి. ముందుగానే ప్రజాప్రతినిధులు చెప్పినప్పటికీ ఆచరణలో మాత్రం దరఖాస్తు కొరత తీవ్రంగా వేధించింది. నేటి నుంచి మిగిలిన గ్రామాల్లోనైనా దరఖాస్తు కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.
హన్వాడ, డిసెంబర్ 28 : ప్రజాపాలనపై మొదటిరోజు ప్రజలు ఆసక్తి కనబర్చలేదు. మండలంలోని కొనగట్టుపల్లి, యారోనిపల్లి గ్రామాల్లో గురువారం ప్రజాపాలన నిర్వహించారు. కొనగట్టుపల్లిలో 367 దరఖాస్తు లు రావాల్సి ఉండగా కేవలం 130 మాత్రమే వచ్చాయి. యారోనిపల్లిలో 110 వచ్చాయి. ఆరు గ్యారెంటీల్లో ఎక్కువగా పింఛన్, రేషన్‌కార్డులు, ఇండ్లకు దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా తాసీల్దార్ కిష్టానాయక్ మాట్లాడుతూ దరఖాస్తు ఫారంను నింపేందుకు ఇతర శాఖల నుంచి 10 మందిని ఏర్పాటు చేశామన్నారు. ప్రజాపాలన కార్యక్రమం వద్ద వైద్య శిబిరం కూడా నిర్వహిస్తున్నామన్నారు. గ్రామాల్లో దరఖాస్తులు ఇవ్వకున్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జనవరి 6 వరకు పంచాయతీ కార్యదర్శికి అందజేయొచ్చని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ విజయనిర్మల, సర్పంచ్ మానస, ఎంపీటీసీ చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
గద్వాలటౌన్, డిసెంబర్ 28 : ‘మాకే తె ల్వదు.. మీకేం చెప్తాం.. దరఖాస్తు మొత్తం పూర్తి చేసి ఇవ్వండి.. అర్హులైతే పథకాలు వస్తా యి.. లేకుంటే రావు.. ఏం చేస్తాం మరి..’ అంటూ అధికారులు ప్రజలకు చెబుతున్నా రు. దరఖాస్తు ఫారంలో ఎన్నో సందేహాలు ఉన్నాయి.. సమాధానాలు చెప్పేదెవరంటూ మరో పక్క ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో భా గంగా ప్రజాపాలనను నిర్వహిస్తున్నది. ఈ క్ర మంలో గురువారం మున్సిపాలిటీ పరిధిలో ని ఏడు వార్డుల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి అధికారులు దరఖాస్తులను స్వీకరించా రు. కాగా, ఏ పథకానికి మార్కు చేయాలన్న సందిగ్ధంలో ప్రజలు పడ్డారు. కొందరు ప్రభు త్వ ఉద్యోగులు సైతం దరఖాస్తు చేసుకున్నా రు. ప్రభుత్వ ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవద్దని ప్రభుత్వం చెప్పలేదుగా.. దరఖాస్తులు తీసుకోవాలంటూ అధికారులకు ఫారంలు అందజేశారు. మొత్తమ్మీద మొదటి రోజు దరఖాస్తుల స్వీకరణ అంతా అయోమయం.. గందరగోళం మధ్య కొనసాగింది.
వెల్దండ, డిసెంబర్ 28 : మండలంలోని కొట్ర గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభ మొదటి రోజే అబాసుపాలైంది. అర్జీలు పెట్టుకునేందుకు ప్రజలు ఒక్కసారిగా రావడంతో దరఖాస్తు ఫారాలు మొత్తం అ యిపోవడంతో ఆ తర్వాత వచ్చిన ప్రజలు ప రేషాన్లో పడ్డారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో రాగా వెంటనే వెల్దండ తాసీల్దా ర్ రవికుమార్ గ్రామ కార్యదర్శి ద్వారా ఫారా లు తెప్పించి దరఖాస్తులు తీసుకున్నారు.
ఊట్కూర్, డిసెంబర్ 28 : ప్రజాపాలన కార్యక్రమాన్ని గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభించిన అధికారులు ప్రజలకు ద రఖాస్తు ఫారాలను అరకొరగా అందించారు. ఊట్కూర్ మండలకేంద్రంలో దరఖాస్తు ప త్రాల పంపిణీ సమయంలో ప్రజల మధ్య తో పులాట జరిగింది. కార్యక్రమంపై ప్రజలకు అవగాహన లేకపోవడంతో పంపిణీ సయమంలో చేతికి అందిన కాడికి దరఖాస్తు పత్రాలను పట్టుకెళ్లారు. ఈక్రమంలో పోలీసులు జోక్యం చేసుకొని ప్రజలను కట్టడి చేయాల్సి వచ్చింది. చాలా మందికి దరఖాస్తు పత్రాలు అందకపోవడంతో జిరాక్స్ సెంటర్లను ఆశ్రయించారు. ఇదే క్రమంలో దరఖాస్తు పత్రానికి జత చేయాల్సిన గుర్తింపు పత్రాలపై స్ప ష్టత కొరవడటంతో అవసరం లేకపోయిన త మ వద్ద ఉన్న అన్ని పత్రాలను దరఖాస్తు ప త్రానికి జత చేసి అధికారులకు అందజేశారు. కొందరు జిరాక్స్ సెంటర్ల నిర్వాహకులు ఒ క్కో దరఖాస్తు పత్రానికి రూ. 10 ప్రజల ను ంచి వసూలు చేశారని ప్రజలు వాపోయారు.