ఊట్కూర్ : అంతర్జాతీయ యోగా దినోత్సవం( International Yoga Day ) సందర్భంగా నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలంలో శనివారం యోగా ప్రదర్శన నిర్వహించారు. మండల లయన్స్ క్లబ్ ( Lions Club) , విశ్వహిందూ పరిషత్ ( VHP) ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా శిబిరంలో మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గరిడి నింగి రెడ్డి, లయన్స్ క్లబ్ జిల్లా కార్యదర్శి ఎల్కోటి జనార్దన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.
యోగాతో ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని తెలిపారు. యోగాతో ఎలాంటి రోగాలు దరి చేరవని, దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ యోగాను అలవాటు చేసుకుని ఆరోగ్యం, ఆనందమయ జీవితాలను గడపాలని కోరారు. పతంజలి యోగ సమితి మండల కోఆర్డినేటర్ బాల్ రాజ్ ఆర్య యోగా మెలకువలను నేర్పించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ మండల శాఖ ఆధ్వర్యంలో పాఠశాలల విద్యార్థులకు స్నాక్స్, ఎనర్జీ డ్రింక్స్ ను పంపిణీ చేశారు.
కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సూర్య ప్రకాష్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు దొబ్బలి హనుమంతు, లయన్స్ క్లబ్ మండల అధ్యక్ష, కార్యదర్శులు వంశీ నికేతన్ రెడ్డి, భరత్, శంకర్, వసంత్ కుమార్, రఘువీర్, మోహన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, వీహెచ్పీ నాయకులు కేశవరావు, లక్ష్మారెడ్డి, రమేష్, నరసింహ, భీమ్ రాజ్, వెంకట్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.