ఫలరాజు అడ్డు కాదు
పండ్ల రాజుగా పిలుచుకునే మామిడి కోసం చాలామంది ఏడాది పొడవునా ఎదురుచూస్తుంటారు. అయితే, ఈ పండు ఎంత రుచిగా ఉంటుందో, బరువు తగ్గాలని ప్రయత్నించే వారి అవాయిడ్ లిస్ట్‌లో కూడా అంతే త్వరగా చేరిపోతుంది.
పండ్ల రాజుగా పిలుచుకునే మామిడి కోసం చాలామంది ఏడాది పొడవునా ఎదురుచూస్తుంటారు. అయితే, ఈ పండు ఎంత రుచిగా ఉంటుందో, బరువు తగ్గాలని ప్రయత్నించే వారి అవాయిడ్ లిస్ట్‌లో కూడా అంతే త్వరగా చేరిపోతుంది. మామిడి పండ్లు తింటే ఒంట్లో కొవ్వు పెరిగిపోతుందని, వెయిట్ లాస్ లక్ష్యాలు దెబ్బతింటాయని చాలామంది భయపడుతుంటారు. కానీ, అసలు సమస్య మామిడి పండులో లేదు, మనం దానిని తినే విధానంలోనే ఉందని ఫిట్నెస్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సరైన పరిమాణంలో, పద్ధతిగా తింటే బరువు తగ్గడానికి మామిడి పండ్లు అడ్డుకావని చెబుతున్నారు.
మామిడి పండ్లను షుగర్ ఎకువగా ఉండే మిల్షేక్లుగా మార్చడం, ఆమ్స్ల్రో అదనంగా చకెర కలపడం, అతిగా తినడం లేదా భారీగా భోజనం చేసిన తర్వాత మళ్లీ మామిడి పండ్లను డెజర్ట్‌గా తీసుకోవడం వల్ల శరీరంలో క్యాలరీల శాతం అమాంతం పెరిగిపోతుంది. ఈ రకమైన ఆహార అలవాట్లు బరువు పెరగడానికి కారణమవుతాయి తప్ప, కేవలం పండు మాత్రమే తినడం వల్ల కాదు. అందుకే మామిడి పండ్లను చకెర, సిరప్లు లేదా స్వీటెన్డ్ డైరీ ప్రొడక్ట్స్‌తో కలిపి ఎకువ క్యాలరీల డెజర్ట్‌గా మార్చవద్దు. దానిలోని సహజమైన పోషక విలువలు దెబ్బతినకుండా, క్యాలరీలు పెరగకుండా తినాలి.
మామిడి పండును వేరే వాటితో కలపకుండా విడిగా ఒక స్నాక్‌లా ఎంజాయ్ చేయాలి. ఈ చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా బరువు తగ్గే లక్ష్యాలు దెబ్బతినకుండా ఈ సీజనల్ ఫ్రూట్‌ను మనసారా ఆస్వాదించవచ్చు. కేవలం ఒక పండును డైట్ నుంచి పూర్తిగా దూరం పెట్టడం వల్లే బరువు తగ్గిపోతారన్న వాదన సరైనది కాదు. దీర్ఘకాలికంగా బరువు అదుపులో ఉండటం అనేది మనం తీసుకునే మొత్తం క్యాలరీలు, క్వాంటిటీ కంట్రోల్, సరైన ఆహార ఎంపికలు, క్రమశిక్షణపై ఆధారపడి ఉంటుంది. స్వీట్స్ లేదా ఐస్ క్రీమ్స్ తినాలనే కోరిక కలిగినప్పుడు ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్స్ కంటే సహజమైన తీపి ఉండే మామిడి పండును తినడం ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. మామిడిపండ్లు తినడం వల్ల ఫైబర్, అవసరమైన విటమిన్లు, సహజమైన తీపి మన శరీరానికి అందుతాయి. అందుకే మామిడి పండును చూసి భయపడాల్సిన అవసరం లేదు. దానిని సరైన పద్ధతిలో తినండి. మీ వెయిట్‌లాస్ జర్నీ ఎప్పటిలాగే సాగుతుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

