జడ్చర్లటౌన్, ఆగస్టు 7 : పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ము న్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి అన్నారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా శనివారం స్థానిక హౌసింగ్‌బోర్డుకాలనీ అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవాలని సూచించారు. అనంతరం తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉండేందుకు తీ సుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కా ర్యక్రమంలో అంగన్వాడీ టీచర్ గౌరమ్మ, కాలనీవాసులు పాల్గొన్నారు. అదేవిధంగా మున్సిపాలిటీలోని 14వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో కౌన్సిలర్ కోనేటి పుష్పలత తల్లిపాల విశిష్టతను వివరించారు. అనంతరం పౌష్టికాహారం పంపిణీ చేశారు.
తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరం
తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరమని ఎంపీడీవో లక్ష్మీదేవి అన్నా రు. తల్లీపాల వారోత్సవాల్లో భాగంగా మం డలంలోని తిర్మలాపూర్ అంగన్వాడీ కేం ద్రంలో బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహా రం పంపిణీ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు విజయలక్ష్మి, అనిత, పంచాయతీ కార్యదర్శి విద్యాసాగర్‌రెడ్డి, ఆశ కార్యకర్త సరోజ పాల్గొన్నారు.
కోయిలకొండ మండలంలో..
మండలంలో ని మల్కాపూర్ అంగన్వాడీ కేంద్రంలో ని ర్వహించిన తల్లిపాల వారోత్సవాల్లో సర్పం చ్ నారాయణయాదవ్ పాల్గొని పౌష్టికాహా రం పంపిణీ చేశారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందించే పౌష్టికాహారా న్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు రాజేందర్‌రెడ్డి, విష్ణుగౌడ్తోపాటు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
మిడ్జిల్ మండలంలో..
మండలంలోని కొ త్తూర్ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వా రోత్సవాలను ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాధికారెడ్డి తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమం లో అంగన్వాడీ టీచర్ వెంకటమ్మ ఉన్నారు.
మహ్మదాబాద్ మండలంలో..
మండలంలో ని దేశాయిపల్లి గ్రామంలో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రఘు మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవడంతోపాటు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ సుల్తానాబేగం, డాక్టర్ ప్రమీల, ఏఎన్ఎం కొండమ్మ, అంగన్వాడీ టీచర్లు నాగమణి, అనిత పాల్గొన్నారు.
బాలానగర్ మండలంలో..
మండలకేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వా రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యతను అంగన్వాడీ టీచర్ కమల వివరించారు. కార్యక్రమంలో ఏఎన్ఎం యాదమ్మ, అంగన్వాడీ టీచర్ సుజాత పాల్గొన్నారు.
ముర్రుపాలు తాపాలి
బిడ్డ పు ట్టిన వెంటనే ముర్రుపాలు తాపాలని అంగన్వాడీ టీచర్లు సూచించారు. జిల్లా కేంద్రంలోని బోయపల్లి, దొడలోనిపల్లి ఐసీడీఎస్ సెక్టార్ పరిధిలో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో అరుధంతి, జయమ్మ, మమత, అరుణ, వరలక్ష్మి, లక్ష్మి, గౌషియాబేగం, రాజమణి, పద్మ, రమాదేవి, రాములమ్మ, చంద్రకళ, వనిత, రమణమ్మ, రాధ, అమృత, ఏఎన్ఎం సుగుణ, సుశీల పాల్గొన్నారు.