నాగర్‌కర్నూల్, మే 12 : బీఆర్ఎస్ నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్ర వీణ్‌కుమార్‌పై నిరాధార ఆరోపణలు చే యడం, ఎన్నికల నిబంధనలకు విరుద్ధం గా వ్యవహరించిన బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్‌కు బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇ న్చార్జి రంగినేని అభిలాష్‌రావు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఫేక్ వార్త పెట్టించారం టూ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, తనపై భర త్ తప్పుడు ఫిర్యాదు చేశారని ఆరోపించారు. ఆర్ఎస్పీ విజయం ఖరారు కావడంతో బీజేపీ కుట్రలకు పాల్పడుతుందన్నారు. ఆర్ఎస్పీ కనుసన్నల్లో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఫేక్ వార్తలు చేస్తుందనడం సరికాదన్నారు. మోదీ ప్రధాని అయ్యాక ఫేక్ సోషల్ మీడియా, ఫేక్ వాట్సాప్ యూనివర్సిటీ ఎవరు తీసుకొచ్చారో ప్రజలందరికీ తెలుసన్నారు. బీజేపీ నేతలే ఈ వార్తను పెడితే తెలియక బీఆర్ఎస్ అభిమానులు షేర్ చేస్తే పార్టీనే సృష్టించిందని నిరాధార ఆరోపణలు చేశారన్నారు. గురుకులాలను అడ్డం పెట్టుకొని విద్యార్థులను చెడగొడుతున్నారనడం విడ్డూరంగా ఉందన్నారు. గురుకులాల్లో సీట్లు కావాలని ఆర్ఎస్పీ కార్యాలయానికి భరత్, ఎంపీ రాములు ఎన్నిసార్లు వచ్చారు, ఎందుకు వచ్చారో చెప్పాలన్నారు. కరీంనగర్లో దాసరి ఉషతో డబ్బులు డిమాండ్ చేశారని ఆర్ఎస్పీపై విమర్శిస్తే చెప్పుతో కొట్టినట్లుగా ఆమె ఖండించారన్నారు. ఆర్ఎస్పీపై చేస్తున్న విషప్రచారం బీజేపీ మనువాద మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. పోలింగ్ బూతుల్లో కనీసం ఏజెంట్లు లేని బీజేపీ పార్టీకి పోటీ ఏంటని, బీ ఆర్ఎస్తో పోల్చితే బీజేపీ బలమెంత అని ప్రశ్నించారు. మోదీ, అమిత్ షా పక్కన కూర్చోగానే పెద్ద నాయకుడిలా భరత్ భావిస్తున్నారన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా సరిగ్గా 48 గంటల ముందు ఓటు వేయాలని అభ్యర్థించరాదని, భరత్ ప్రసాద్ ప్రెస్మీట్లో ఓటు వే యాలని, పార్టీ కండువాతో అభ్యర్థించడం నిబంధనలకు విరుద్ధమన్నారు. ఇలాగే తప్పుడు కార్యక్రమాలు చేస్తే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. భరత్ ప్రసాద్‌పై ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే అధికారులు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, కానీ బీఆర్ఎస్పై, ఆర్ఎస్పీపై నిరాధార ఆరోపణలను వెనక్కి తీసుకొని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నేతలు భాస్కర్‌గౌడ్, హమీద్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.