అయిజ, సెప్టెంబర్ 15 : అయిజ మున్సిపాలిటీలోని సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని అఖిలపక్ష కమిటీ నాయకులు మండిపడ్డారు. సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లాలోని అయిజ పుర కార్యాలయాన్ని ముట్టడించారు. కమిషనర్ సైదయ్య సెలవులో ఉన్నారని తెలుసుకొని కార్యాలయానికి తాళం వేసేందుకు యత్నించగా.. ఉద్రిక్తత నెలకొన్నది.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆస్తి పన్ను మా త్రం ముక్కుపిండి వసూలు చేస్తున్న అధికారులు.. సమస్యలు మాత్రం పట్టనట్లు వ్య వహరిస్తున్నారని ఆరోపించా రు. 20 వార్డుల్లో ము రుగు, వర్షం నీటినిల్వతో కంపుకొడుతున్నాయన్నారు. కమిషనర్, ఏఈలు పర్యవేక్షణ కొరవడిందని ధ్వజమెత్తారు. కమిషనర్ దళారులను నియమించుకొని అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లడంలేదని విమర్శించారు.
ప్రజా సమస్యలను గాలికొదిలేసిన కమిషనర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఏఈ రాజశేఖర్‌తో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. ఎస్సై శ్రీనివాసరావు అక్కడకు చేరుకొని నాయకులను సముదాయించగా.. ఏఈకి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో నాగర్‌దొడ్డి వెంకట్రాములు, ఆంజనేయులు, జగపతిరెడ్డి, రంగు మద్దిలేటి, కుర్వ పల్లయ్య, రామచంద్రారెడ్డి, స్వప్న, తాహేర్ తదితరులు పాల్గొన్నారు.