గద్వాల, మే 30 : జిల్లాలో ఎరువులు, విత్తనాల కృత్రిమ కొరత సృ ష్టించే డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులను జోగుళాంబ గద్వాల కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో వ్యవసాయశాఖ అధికారులతో సమావేశమై మాట్లాడారు. ప్రతి దుకాణంలో డీలర్లు తప్పనిసరిగా స్టాక్ బోర్డు, అమ్మకం వివరాలు విధిగా ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్టాక్ బోర్డులో సూచించిన మే రకు దుకాణంలో స్టాక్ ఉందో లేదో తనిఖీ చేయాలన్నారు. డీలర్లు ఎమ్మార్పీ ధరలకే విత్తనాలను విక్రయించాలని, నకిలీవి అమ్మేవారిపై నిఘా ఉంచాలన్నారు.
నాసిరకం విత్తనాలు, ఎరువులు విక్రయించే డీలర్లపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయాలని సూచించారు. నిబంధనలు పాటించని డీలర్లపై చ ర్యలు తీసుకుంటేనే మిగతా వారు రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను విక్రయిస్తారని తెలిపా రు. జూన్ 15వరకు వ్యవసాయశాఖ అధికారులు రోజుకు నాలుగైదు దుకాణాలను తనిఖీ చేస్తూ రైతులకు విత్తనాలు సక్రమంగా అందేలా చూడాలన్నా రు. కొరత ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకు రా వాలన్నారు. అవసరం మేరకు స్టాక్ తెప్పించి రైతులకు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఏవో గో విందునాయక్, ఏవోలు పాల్గొన్నారు.