మహబూబ్‌నగర్, జూలై 8 (నమస్తే తెలంగాణ ప్రతిని ధి) : రేవంత్‌రెడ్డి.. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధిపై సమీక్ష నిర్వహించనున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్లో మధ్యాహ్నం 12:45 గంటలకు కలెక్టరేట్‌కు చేరుకుంటారు. మహిళాశక్తి క్యాంటీన్, అభివృద్ధి కా ర్యక్రమాలు ప్రారంభించిన తరువాత ఉమ్మడి పాలమూ రు జిల్లా అభివృద్ధిపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. కాగా, ముఖ్యమంత్రి పర్యటన ముగిసే వరకు మీడియాకు అనుమతిని నిరాకరించారు. కేవలం మీడియా సెంటర్లో మాత్రమే పత్రి కా ప్రతినిధులను అనుమతిస్తున్నారు. కాగా, సీఎం పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ విజయేందిరబోయి, ఎస్పీ జానకి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా హెలీప్యాడ్, సమీక్ష నిర్వహించే సమీకృత జిల్లా అధికారుల సముదాయం సమావేశ మందిరాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో డీఆర్డీవో నర్సింహులు, డీఎఫ్‌వో సత్యనారాయణ, అధికారులు పాల్గొన్నారు.