వెల్దండ : సీఎం సహాయనిధి పథకం (CM Relief Fund ) పేదల పాలిట వరమని కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కేశమళ్ల కృష్ణ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామ పంచాయతీకి చెందిన మాడుగుల జంగయ్య ఆస్పత్రి ఖర్చులకోసం మార్కెట్ డైరెక్టర్ కేశమల్ల కృష్ణ సహకారంతో సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు.
దీంతో ఎమ్మెల్యే సహకరించడంతో సీఎం సహాయ నిధి పథకం కింద మంజూరైన రూ .32 వేల రూపాయల చెక్కు ఆదివారం పెద్దాపూర్ గ్రామంలో కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుద్దట్టి లక్ష్మారెడ్డి, నెంట శ్రీను, తిరుపతి నాయక్, కాటిక రాములు, బాలయ్య, కృష్ణయ్య, మాదవులు, విజేందర్ రెడ్డి, ప్రవీణ్ నాయక్, సుధాకర్, అనిల్, అజార్, తదితరులు పాల్గొన్నారు.