చారకొండ, నవంబర్ 26 : దళితుల అభ్యున్నతికి కోసం 75 ఏండ్ల స్వతంత్ర దే శంలో దళితుల కోసం ఆనాడు అంబేద్కర్ ఆలోచన చేస్తే.. నేడు సీఎం కేసీఆర్ దళితు ల ఆత్మ విశ్వాసంతో బతికేందుకే దళితబంధు అమలు చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా చారకండ మండల కేంద్రంలో దళితబంధు యూనిట్లను విప్ గువ్వల బాలరాజు, ఎంపీ రాము లు, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌తో కలిసి మంత్రి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సం దర్భంగా మంత్రి మాట్లాడుతూ దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ అద్భుతమైన ఈ పథకాన్ని రూపొందించారన్నారు.
రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన నాలుగు మండలాల్లో చారకొండ ఉండడం అదృష్టమన్నారు. ఈ ప థకం దేశవ్యాప్తంగా అమలు అవుతుందని ప్రజలు విశ్వాసంతో ఉన్నారని అన్నారు. అన్ని రంగాలో సింహ భాగాన్ని కల్పిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 9 విడుతల వారీగా 65 లక్షల మంది రైతులకు ఈ సాయం అందజేసినట్లు తెలిపారు. అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రజలంతా వెన్నంటే నిలబడాలని కోరారు. తెలంగాణ పథకాలు కావాలని అన్ని రాష్ర్టాల డిమాండ్ చేస్తున్నాయని తెలిపారు.
దేశంలో పడ్డ పెద్ద దొంగలను పట్టించిన హీరో గు వ్వల బాలరాజు అన్నారు. అనంతరం విప్ గువ్వల మాట్లాడుతూ సబ్బండ వర్గాల బాంధవుడు కేసీఆర్ అన్నారు. త్వరలో గిరిజనబంధు, బీసీబంధు అమలు చేయనున్న దేశంలోనే ఏకైక నేత సీఎం కేసీఆర్ అన్నారు. రాజ్యాంగ దినోత్సవం రోజు దళితబంధు లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేయడం సంతోషంగా ఉన్నదన్నారు. ఈ పథకానికి రూప కల్పన చేసినందుకు దళితజాతి సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉండాలన్నారు. చారకొండ మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు.
ఎంపీ రాములు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలందరి ప్రజాబాంధవుడు కేసీఆర్ అన్నారు. దళితుల అభ్యున్నతి అంబేద్కర్‌తోనే సాధ్యమైందన్నారు. రూపాయి పెట్టుబడి లేకుండా దళితబంధు వంద శాతం నిధులతో లబ్ధిదారులు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారని చెప్పారు. ఈ పథకంలో రక్షణ నిధి ఏర్పాటు చేసి లబ్ధిదారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి అండగా నిలుస్తుందన్నారు. ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ లబ్ధిదారుడు వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా వివిధ రంగాల్లో పరిశ్రమలు స్థాపించి వ్యాపారవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. అంతకుముందు మండల కేంద్రంలో నిర్మించిన కేజీబీవీ భనవంతోపాటు రైతువేదికను మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా, జెడ్పీ వైస్‌చైర్మన్ బాలాజీసింగ్, అదనపు కలెక్టర్ మోతీలాల్ నాయక్, ఈడీ రాంలాల్, ఎంపీపీ నిర్మల, సర్పంచ్ విజేందర్‌గౌడ్, విండో చైర్మన్ గురువయ్యగౌడ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు గజ్జెయాదయ్య, వెంకటయ్యయాదవ్, నాయకులు రవీందర్, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.