పాలమూరు, అక్టోబర్ 7 : ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. శనివారం రాత్రి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో ఏర్పాటు చేసిన పీఆర్టీయూ టీఎస్ ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పీఆర్టీయూ నాయకుడి కుమారుడిగా, ఉద్యోగ సంఘాలు, ఉద్యమ నేతగా ఉద్యోగ, ఉపాధ్యాయులపై ప్రత్యేక అభిమానంతో పనిచేస్తామని తెలిపారు. ఉద్యోగ సంఘాల నాయకుడు, ఉద్యమనేత అయిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను రాబోయే ఎన్నికల్లో మరోసారి అఖండ మెజార్టీతో గెలిపించే బాధ్యత తాము తీసుకుంటున్నట్లు పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమలాకర్, సంఘం నాయకులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర మాజీ కార్యదర్శి చెన్నకేశవరెడ్డి, జిల్లా అధ్యక్షుడు నారాయణ్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి రఘురాంరెడ్డి, జిల్లా గౌరవ అధ్యక్షుడు గోపాల్‌నాయక్, సహ యునియన్ నాయకులు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
అభివృద్ధిని గుర్తించాలి
కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని ఆబ్కా రీ, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. తిరుమలహిల్స్‌లో నిర్మించే రెడ్డి సంఘం కన్వెన్షన్ హాల్, జేజేఆర్ గార్డెన్ సమీపంలో హజ్‌హౌస్, ఖురేషీ ఫంక్షన్ హాల్, ఏనుగొండలో యాదవసం ఘం, బోయపల్లిలో రెడ్డిసంఘం కమ్యూనిటీ హా ల్, తూర్పు కమాన్ వద్ద జామియా మసీద్ సమీపంలో కమ్యూనిటీ హాల్, మార్కెట్ యార్డు సమీపంలో ఈద్గా ప్రహరీ పనులకు శంకుస్థాపనలు, భూమిపూజ చేశారు. కొత్తగంజిలో గ్రంథాలయా న్ని ప్రారంభించి మాట్లాడారు. అన్ని రంగాల్లో రా ష్ట్రం దూసుకుపోతున్నదన్నారు. ఎన్నికల వేళ మాయమాటలు చేప్పే వారిని నమ్మొద్దని, కండ్ల ముందు జరుగుతున్న అభివృద్ధిని గమనించాలన్నారు. హజ్‌హౌస్ నిర్మాణాన్ని కొంతమంది అ డ్డుకున్న విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. అందరికీ అందుబాటులో ఉండేలా నిర్మిస్తున్నామన్నా రు. మహబూబ్‌నగర్‌లో మైనార్టీల కోసం 6 గురుకులాలు ఏర్పాటు చేశామన్నారు. వాటినే ఇంటర్‌కు అప్‌గ్రేడ్ చేశామని, వచ్చే ఏడాది డిగ్రీ కళాశాలలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మ న్ నర్సింహులు, ముడా చైర్మన్ వెంకన్న, డీసీసీబీ ఇన్చార్జి చైర్మన్ వెంకటయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ రహెమాన్, వైస్‌చైర్మన్ గిరిధర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఆడిటోరియం పనులకు శంకుస్థాపన
మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో రూ.5కోట్లతో నిర్మించనున్న ఆడిటోరియం పనులకు మంత్రి శనివారం భూమిపూజ చేసి మాట్లాడారు. తాను చదివిన కళాశాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మరిన్ని నిధులు తీసుకొచ్చి కళాశాలను మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. అనంతరం మంత్రికి కృతజ్ఞతగా ఆయన చిత్రపటానికి విద్యార్థులు పాలతో అభిషేకం చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పద్మావతి, ముడా చైర్మన్ వెంకన్న, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
రైతులకు భోజనశాల ప్రారంభం
మార్కెట్ యార్డులో రైతు ల కోసం రూ.27లక్షలతో నిర్మించిన ఉచిత భోజనశాల, రూ.30లక్షలతో ని ర్మించిన వాటర్‌ట్యాంక్ ను మంత్రి ప్రారంభించారు. అనంతరం హ మాలీలు, దడవాయిల కు సర్టిఫికెట్లు పంపిణీ చే శారు. అదేవిధంగా మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసి మాట్లాడారు. మార్కెట్ యార్డుకు ధాన్యం తీసుకొచ్చిన రైతుల ఆకలి తీ ర్చేందుకు ఉచిత భోజనశాల ఏ ర్పాటు చేయడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రహమాన్, వైస్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, డైరెక్టర్లు, వ్యవసాయ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి శ్రీనివాస్, రైతులు
తదితరులు పాల్గొన్నారు.