కొత్తకొత్తగా..
మండలంలోని ఏదుల గ్రామం మండలంగా మారనుంది. మండల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించగా.. మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ, సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. పటాకులు కాల్చి సంబురాలు జరుపుకొన్నారు.
- ఇక మండలంగా మారనున్న ఏదుల
- ఎనిమిది గ్రామాలను కలుపుకొని..
- గెజిట్ విడుదల చేసిన ప్రభుత్వం
- పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్న గ్రామస్తులు
- సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం
గోపాల్పేట, ఆగస్టు 22: మండలంలోని ఏదుల గ్రామం మండలంగా మారనుంది. మండల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించగా.. మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ, సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. పటాకులు కాల్చి సంబురాలు జరుపుకొన్నారు. వనపర్తి జిల్లా రేవల్లి మండలంలోని చెన్నారం, చీర్కపల్లి గోపాల్పేట మండలంలోని ఏదుల, నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలంలోని సింగాయిపల్లి, తుర్కదిన్నె, మాచుపల్లి, ముత్తిరెడ్డిపల్లి, రేకులపల్లి 8గ్రామాలు కలిసి నూతన మండలంగా ఏర్పాటు కానుంది. మండల ఏర్పాటుకు కృషిచేసిన మంత్రి నిరంజన్‌రెడ్డితోపాటు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ నాగమణి, బాల్‌రెడ్డి, రమేశ్, సునీల్ ఉప సర్పంచ్ ఆంజనేయులు, ఎంపీటీసీ నరేందర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
నెరవేరిన ఏదుల వాసుల కల
వనపర్తి, ఆగస్టు 22: ఏదుల గ్రామస్తులు తమ గ్రామం మండలంగా మారాలని ఓ కలగా ఉండేదని అటువంటి కల నిజమైందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మంగళవారం ప్రకటనలో తెలిపారు. రేవల్లి మండలంలోని చెన్నారం, చీర్కపల్లి, గోపాల్పేట మండలంలోని ఏదుల, కోడేర్ మండలంలోని సింగాయపల్లి, తుర్కదిన్నె, మాచుపల్లి, ముత్తిరెడ్డిపల్లి, రేకులపల్లితో కలిసి ఏదుల మండలంగా రూపుదిద్దుకుందన్నారు. మండల ఏర్పాటుకు కృషి చేసిన సీఎం కేసీఆర్‌కు మండల ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలను తెలుపుతున్నట్లు తెలిపారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

