మూసాపేట, డిసెంబర్ 13 : నిరంత ర అభివృద్ధి శ్రామికుడు సీఎం కేసీఆర్ అ ని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మూసాపేటతోపాటు అడ్డాకుల మండలంలోని పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను మూసాపేటలో ఆయన పంపిణీ చేశారు. కొమిరెడ్డిపల్లి గ్రామానికి చెం దిన పద్మమ్మ, మోహన్ దంపతుల కూ తుళ్లు పూజిత, హారతి వివాహాలు జరగడంతో వారికి ఒకేసారి కల్యాణలక్ష్మి సా యం మంజూరైంది. ఇందుకు సంబంధించిన చెక్కులను అందిస్తూ ఎమ్మెల్యే సాయం మరువద్దన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో నేడు దేవరకద్ర నియోజకవర్గంలోని వా గుల్లో ఏడాది పొడవునా నీళ్లు నిల్వ ఉం టున్నాయన్నారు.
ఎంజీకేఎల్, ఇతర ఎత్తిపోతల పథకాల నీటితో నియోజకవర్గంలో లక్షా 75 వేల ఎకరాలు సాగవుతున్నాయని తెలిపారు. ఇప్పటికే రూ.9 వేల కోట్ల రైతుబంధు సాయం ఖాతాల్లో జమ కాగా.. 11 వేల మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేశామన్నారు. మన రైతు సంక్షేమ పథకాలను చూసి యావత్ దేశ ప్రజలు కేసీఆర్ పాలన కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ మారిందని, అధికారంలోకి వస్తే అన్ని రాష్ర్టాల్లో అభివృద్ధి పరుగులు పెట్టడం ఖాయమన్నారు. ఇతర రాష్ర్టాల ప్రజలు కేసీఆర్ పాలన కావాలని కోరుకుంటుంటే తెలంగాణలో లబ్ధిపొందిన ప్రజలు ఆయన వె న్నంటే నిలబడాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, ఎంపీపీలు దోనూరు నాగార్జునరెడ్డి, కళావతికొండయ్య, వైస్ ఎంపీపీ రాచాల రా ధిక, రవీందర్‌రెడ్డి, తాసిల్దార్లు కిషన్, మంజుల, నాయబ్ తాసిల్దార్ శ్రీనివాసులు, బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మీనరసింహాయాదవ్, సర్పంచు లు, ఎంపీటీసీలు, నాయకులు ఉన్నారు.