సొంతింటి కల నెరవేర్చిన సీఎం కేసీఆర్
గూడు లేని పేదలకు సీఎం కేసీఆర్ డబుల్బెడ్రూం ఇండ్లు అందించి సొంతింటి కల నెరవేర్చారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు.
- దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
దేవరకద్ర రూరల్, జనవరి 29 : గూడు లేని పేదలకు సీఎం కేసీఆర్ డబుల్బెడ్రూం ఇండ్లు అందించి సొంతింటి కల నెరవేర్చారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆదివారం చిన్నచింతకుంట మండలంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. లాల్‌కోటలో రూ.20లక్షలతో పంచాయతీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. అప్పంపల్లికి చెందిన అలీమొద్దీన్కు రూ.60వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. కురుమూర్తిలో డబుల్ బెడ్రూం ఇండ్ల వద్ద సీసీ పనులు, హైమాస్ట్‌లైట్లను ప్రారంభించారు.
వాల్మీకి కమ్యూనిటీ భవన నిర్మాణానికి రూ.5లక్షలు, పల్లమర్రిలో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.5లక్షలు, ఉంద్యాలలో మట్టిరోడ్డు నిర్మాణానికి రూ.2లక్షలు, చింతకుంటలోని ఎస్సీకాలనీలో హైమాస్ట్‌లైట్ల నిర్మాణానికి లక్షా యాబైవేల రూపాయల ప్రొసీడింగ్ కాపీలను ఆయా గ్రామాల సర్పంచులకు అందజేశారు.
కురుమూర్తి గ్రామంలో అర్హులైన 140మం ది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ తెలంగాణలోని పేదలకు రూ.5లక్షలతో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి అందజేస్తున్నట్లు తెలిపారు. సామాజిక వర్గాలకు, కుల వృత్తుల ఆర్థిక అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు రూపొందించి అందరికీ సీఎం కేసీఆర్ ఆప్తుడయ్యాడని చెప్పారు. ప్రతిఒక్కరూ కేసీఆర్‌కు అండగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ హర్షవర్ధన్‌రెడ్డి, జెడ్పీటీసీ రాజేశ్వరి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కోట రాము, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

