కరెంటు బిల్లులపై స్పష్టత ఇవ్వండి
రాష్ట్ర ప్రభుత్వం ఉ చిత కరెంటుపై స్పష్టత ఇవ్వాలని పలువురు మం డల ప్రజాప్రతినిధులు ట్రాన్స్‌కో అధికారులను కో రారు. మండల సర్వసభ్య సమావేశాన్ని శుక్రవారం ఎంపీపీ అనంతయ్య అధ్యక్షతన మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు.
- రైతుబంధు డబ్బులు త్వరగా పంపిణీ చేయాలి
- మండల సమావేశంలో అధికారులను ప్రశ్నించిన ప్రజాప్రతినిధులు
నవాబ్‌పేట, డిసెంబర్ 29 : రాష్ట్ర ప్రభుత్వం ఉ చిత కరెంటుపై స్పష్టత ఇవ్వాలని పలువురు మం డల ప్రజాప్రతినిధులు ట్రాన్స్‌కో అధికారులను కో రారు. మండల సర్వసభ్య సమావేశాన్ని శుక్రవారం ఎంపీపీ అనంతయ్య అధ్యక్షతన మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. ట్రాన్స్‌కో ఏఈ సంతోష్‌కుమార్ తమ శాఖ పనితీరును వివరిస్తుండగా పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 200 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా అందిస్తామని చెప్పిన హామీని నిలబెట్టుకోవాలని సర్పంచులు గోపాల్‌గౌడ్, సత్యం, వైస్ ఎంపీపీ సంతోష్‌రెడ్డి తదితరులు సభ దృష్టికి తెచ్చా రు. లేదంటే జనవరి నుంచి కరెంటు బిల్లులు కట్టరని స్పష్టం చేశారు. అనంతరం వ్యవసాయ శాఖ పనితీరును మండల వ్యవసాయాధికారి కృష్ణకిశోర్ వివరిస్తుండగా, జెడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, కారుకొం డ ఎంపీటీసీ గోపాల్, వైస్ ఎంపీపీ సంతోష్‌రెడ్డి మాట్లాడుతూ యాసంగి సీజన్లో వరినాట్లు వేసుకునే సమయం వచ్చిందని, నేటికీ రైతుబంధు డ బ్బులు పడక, రైతులు సాగును చాలావరకు తగ్గించుకునే అవకాశం ఉందన్నారు. అనంతరం పంచాయతీరాజ్, నీటిపారుదల, విద్య, వైద్యం, పశువైద్యం, ఉద్యానవన, ఆబ్కారీ, ఆర్టీసీ, ఐసీడీఎస్, తదితర శాఖల పనితీరుపై సభలో చర్చ జరిగింది.
సభ మధ్యలోనే వెళ్లిపోయిన అధికారులు..
మండల సర్వసభ్య సమావేశం నుంచి కొందరు అధికారులు, మధ్యలోనే నెమ్మదిగా బయటికి వెళ్లారు. మరికొందరు గైర్హాజరయ్యారు. దీనిపై అధికారులు ఇలా వ్యవహరించడమేమిటని పలువురు ప్రజాప్రతినిధులు సభలో చర్చించుకొన్నారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ నర్సిములు, ఎంపీడీవో శ్రీలత, కోఆప్షన్ సభ్యులు తాహెర్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

